యూఏఈలో 20% వరకు పెరిగిన ఫైట్స్, హోటల్స్ ధరలు..!!

- December 18, 2024 , by Maagulf
యూఏఈలో 20% వరకు పెరిగిన ఫైట్స్, హోటల్స్ ధరలు..!!

యూఏఈ: యూఏఈలో వాతావరణం చల్లబడటంతో హాలిడే ట్రావెల్‌ పెరిగింది. దాంతో సీకేషన్ బుకింగ్‌లలో పెరుగుదల నమదవుతుంది. అయితే, చివరి నిమిషంలో విహారయాత్రకు వెళ్లేవారు అధిక ఖర్చులను ఎదుర్కోవచ్చని, గమ్యస్థానం, వసతి, విమానాలు, హోటళ్లు, వీసా లభ్యత వంటి కారణాల వల్ల ధరలు సాధారణంగా 15 నుండి 20 శాతం వరకు పెరుగుతాయని ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు. వింటర్  ముఖ్యంగా డిసెంబర్ మధ్య నుండి జనవరి ప్రారంభం వరకు ఉంటుంది. ఆ సమయంలో స్కూల్స్ సెలవులు, క్రిస్మస్, నూతన సంవత్సరానికి విదేశాలకు వెళ్లడం వలన ధరలు పెరుగుతాయి. అధిక ధరలు ఉన్నప్పటికీ, చాలా మంది నివాసితులు ఇప్పటికీ ఈ సెలవు సీజన్‌లో చివరి నిమిషంలో ప్రయాణాలను ఎంచుకుంటున్నారని ట్రావెల్ ఏజెంట్లు తెలిపారు.

సాధారణంగా వింటర్ సీజన్ కు విమాన ఛార్జీలు, హోటల్స్ ధరలు ఇతర కార్యకలాపాల  డిమాండ్ పీక్స్‌లో పెరుగుతాయి. విమాన ఛార్జీలు, హోటల్ ధరలు..సీజన్ లో ఆయా తేదీలను బట్టి డిమాండ్ పెరిగేకొద్దీ ఎక్కువగా ఉంటుంది.  ముందుగా బుక్ చేసుకునే వారి కంటే సగటున, చివరి నిమిషంలో ప్రయాణికులు 15-20 శాతం ఎక్కువ చెల్లించాల్సి రావచ్చు.  అయినప్పటికీ, చివరి నిమిషంలో శీతాకాల సెలవుల కోసం ఇంకా చాలా మంది ఆసక్తి చూపుతుండటం గమనార్హం. 

యూరోపియన్ గమ్యస్థానాలకు టిక్కెట్ ధరల భారీగా పెరుగుతున్నాయి. స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు స్థిరంగా జనాదరణ పొందడంతో యూరప్ పర్యటనను యూఏఈ ప్రయాణికులు అత్యధికంగా ఎంచుకుంటున్నారు. వింటర్ సీజన్‌లో యూరోపియన్ గమ్యస్థానాలకు టిక్కెట్ ధరలలో 10-12 శాతం పెరుగుదల నమోదైంది. అదే సమయంలో యూఏఈ నివాసితులు జార్జియా, కజాఖ్స్తాన్, కిర్గిజ్స్తాన్, అర్మేనియా వంటి స్ట్రీమ్లైన్డ్ వీసా ఉన్న దేశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే  పొరుగున ఉన్న ఖతార్, ఒమన్, సౌదీ అరేబియా వంటి GCC దేశాలకు కూడా డిమాండ్ అధికంగా ఉందని నిపుణులు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com