కరుణానిధి మనవడితో వియ్యమందుకుంటున్న విక్రమ్
- June 27, 2016
ప్రముఖ నటుడు విక్రమ్ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయట. విక్రమ్ కుమార్తె అక్షిత నిశ్చితార్థ వేడుక త్వరలో జరగనున్నట్లు తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. కేవిన్ కేర్ గ్రూప్ యజమాని సీకే రంగనాథన్ కుమారుడు మను రంజిత్‌తో అక్షిత వివాహం జరగనున్నట్లు సమాచారం. రంజిత్ డీఎంకే అధినేత ఎం. కరుణానిధికి మునిమనవడు అవుతాడు. కరుణానిధి పెద్ద కుమారుడు ముత్తు కూతురి కొడుకు రంజిత్. ఈ నిశ్చితార్థ కార్యక్రమాన్ని జులై 10న చెన్నైలోని ఓ స్టార్ హోటల్లో నిర్వహిస్తున్నట్లు సమాచారం. కేవలం సన్నిహితులు, బంధువులు ఈ వేడుకకు హాజరౌతున్నట్లు తెలుస్తోంది. 2017లో జరిగే ఈ వివాహానికి చిత్ర పరిశ్రమకు సంబంధించిన తన స్నేహితులందరినీ ఆహ్వానించడానికి విక్రమ్ ప్రయత్నిస్తున్నారట.
తాజా వార్తలు
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!







