డిసెంబరు 21న కువైట్‌లో ‘ ఖగోళ అద్భుతం’..!!

- December 18, 2024 , by Maagulf
డిసెంబరు 21న కువైట్‌లో ‘ ఖగోళ అద్భుతం’..!!

కువైట్: కువైట్‌లో డిసెంబర్ 21న ఖగోళ అద్భుతం చోటుచేసుకోనుంది. ఆరోజున లాంగ్ నైట్ అవర్స్ నమోదు కానున్నాయి. మధ్యాహ్నం 12:21 గంటలకు రాత్రి గడియలు ప్రారంభమవుతాయని అల్-అజారీ సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది. డిసెంబర్ 21న సూర్యుడు మకర రాశికి లంబంగా ఉండి ఆకాశంలో దాని అత్యల్ప స్థానానికి చేరుకుంటాడని, దాని ఫలితంగా కువైట్ సంవత్సరంలోని అతి సుధీర్ఘమైన రాత్రిని చూస్తుందన్నారు. ఈ సంఘటన ఖగోళ శాస్త్రపరంగా శీతాకాలపు ప్రారంభంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే రాత్రి గంటలు సాధ్యమైనంత ఎక్కువ సమయం,  పగటి సమయాలు తక్కువగా ఉంటాయి. ఆ రోజు సూర్యాస్తమయం సాయంత్రం 4:54 నిముషాలకు కానుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com