అబుదాబిలో ప్రమాదాల నివారణకు అవగాహన ప్రచారం..!!

- December 18, 2024 , by Maagulf
అబుదాబిలో ప్రమాదాల నివారణకు అవగాహన ప్రచారం..!!

యూఏఈ: ఇటీవల కాలంలో యూఏఈలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది. పోలీసులు, అధికారులు పదే పదే హెచ్చరించినప్పటికీ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల భయంకరమైన ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ  నేపథ్యంలో అబుదాబి అధికారులు రోడ్డు ప్రమాదాల నివారించడానికి అవగాహన ప్రచారాన్ని ప్రారంభించారు.

అబుదాబి సెంటర్ ఫర్ లీగల్ అండ్ కమ్యూనిటీ అవేర్‌నెస్ (మసౌలియా) 'రోడ్డుపై మీ భద్రత మీ బాధ్యత' అనే డ్రైవ్‌ను ప్రారంభించింది. బాధ్యతారహితంగా డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, అతివేగంగా నడపడం, ఉద్దేశపూర్వకంగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.  

ఈ ఏడాది ప్రారంభంలో షార్జాలోని ఎమిరేట్స్ రోడ్‌లో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా జరిగిన కారు ప్రమాదంలో 24 ఏళ్ల నవ వధువు మరణించింది. అప్పటికి ఆమె వివాహమైన మూడు వారాలు మాత్రమే అవుతుంది  

జైలు శిక్ష, భారీ జరిమానాలు

నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు సంబంధించిన చట్టపరమైన జరిమానాల గురించి ప్రజలకు తెలియజేస్తున్నారు. యూఏఈ ఫెడరల్ ట్రాఫిక్ చట్టం ప్రకారం, ఉద్దేశపూర్వకంగా ఇతరుల ప్రాణాలకు మరియు భద్రతకు హాని కలిగించే ఎవరైనా జైలు శిక్ష, జరిమానాలను ఎదుర్కోవాలి. అటువంటి చర్యల వల్ల ఏదైనా నష్టం జరిగితే, జరిమానాలు మరింత తీవ్రంగా ఉంటాయి. ట్రాఫిక్ చట్టాలకు కట్టుబడి మరియు బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయడం కేవలం వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాదు, సమాజ భద్రత కోసం సమిష్టి బాధ్యత అని మసౌలియా చెప్పారు. డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను పాటించాలని కోరారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com