అస్రీ బీచ్‌లో బీచ్ క్లీన్-అప్ డ్రైవ్‌ చేపట్టిన బహ్రెయిన్ ఒడియా సమాజ్..!!

- December 19, 2024 , by Maagulf
అస్రీ బీచ్‌లో బీచ్ క్లీన్-అప్ డ్రైవ్‌ చేపట్టిన బహ్రెయిన్ ఒడియా సమాజ్..!!

మనామా: ముహర్రక్ మునిసిపాలిటీ సహకారంతో బహ్రెయిన్ ఒడియా సమాజ్.. అస్రీ బీచ్, హిద్ద్ వద్ద బీచ్ క్లీన్-అప్ డ్రైవ్‌ను విజయవంతంగా నిర్వహించింది.  కార్యక్రమాన్ని అధికారికంగా భారత రాయబార కార్యాలయం అధికారి చితా రంజన్ నాయక్, బహ్రెయిన్ ఒడియా సమాజ్ ప్రెసిడెంట్ ప్రభాకర్ పాడి ప్రారంభించారు. క్లీన్-అప్ డ్రైవ్ ఆస్రీ బీచ్ సహజ సౌందర్యాన్ని మెరుగుపరచడమే కాకుండా పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచింది.  అనంతరం బహ్రెయిన్ ఒడియా సమాజ్ దాని సభ్యులు,  వాలంటీర్లను అధికారులు అభినందించారు. ఈ చొరవ పౌర బాధ్యత పట్ల సంస్థల నిబద్ధతను చెబుతుందన్నారు. ఇదే విధమైన భవిష్యత్ ప్రయత్నాలకు సానుకూల ఉదాహరణను సెట్ చేస్తుందని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com