బుక్ ఫెయిర్ లాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తాం: సీఎం రేవంత్
- December 19, 2024
హైదరాబాద్: రాబోయే రోజుల్లో బుక్ ఫెయిర్ లాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను ఇవాళ ఆయన ప్రారంభించారు.బుక్ స్టాల్స్‌ను పరిశీలించారు.అనంతరం మాట్లాడుతూ.. ప్రస్తుత డిజిటల్ యుగంలో పుస్తకాల ప్రాధాన్యత తగ్గుతోందని చెప్పారు.ఈ క్రమంలో భావి తరానికి స్ఫూర్తినివ్వాలని బుక్ ఫెయిర్ నిర్వహించడం అభినందనీయం అన్నారు. మనం చరిత్ర చదువుకుంటేనే భవిష్యత్‌కు సరైన మార్గాన్ని నిర్దేశించుకోవచ్చని నేటి తరానికి చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.
తమ కలం, గళం ద్వారా సమాజానికి చైతన్యాన్ని అందించడంతో పాటు ప్రజా పోరాటాలు చేసిన కవులు, కళాకారుల పేర్లు బుక్ ఫెయిర్ వేదికలకు పెట్టడం ద్వారా సందేశాన్ని ఇచ్చారన్నారు. సాయుధ రైతాంగ పోరాటం, తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమంలో కూడా చర్రిత కొంత వక్రీకరణకు గురైందన్నారు. తెలంగాణ ఉద్యమంలో సమిదలైన వారి కంటే రాజకీయ ప్రయోజనం పొందిన వారికే ఎక్కువ పేరు వచ్చిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో పోరాటంలో చేసిన వారి పేర్లు చరిత్రలో ఉండాలన్నారు. చదివిన పుస్తకాలు, చైతన్య పర్చిన గానం నుంచి క్రోడీకరించి తాను ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపైన మాట్లాడానన్నారు. సాంకేతిక పరిజ్జానం పెరగడంతో డిజిటల్ మీడియా కారణంగా పుస్తకాల ప్రాధాన్యత తగ్గిపోతోందన్నారు.
చరిత్ర చదువుకుంటూనే భవిష్యత్తు తరాలకు మంచి సందేశం ఇవ్వగలమన్నారు. మంచి సందేశం ఇవ్వడం కోసమే బుక్ ఫెయిర్ లో తాను, తమ మంత్రులు పాల్గొన్నామన్నారు. సామాజిక చైతన్యం, సమాజంలో వచ్చే మార్పులపై చర్చించడానికి బుక్ ఫెయిర్ మంచి వేదికగా ఉంటుందన్నారు. చరిత్రకారులను గుర్తించుకోవడం కోసమే తెలుగు యూనివర్సిటీ కి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టుకున్నామన్నారు. కాళోజీ, దాశరథి లాంటి కవులెందరో తెలంగాణ తొలి ఉద్యమానికి స్ఫూర్తి ఇచ్చారన్నారు.అందె శ్రీ, గూడ అంజయ్య, గద్దర్ లాంటి వారు మలి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ఇచ్చారన్నారు.నిజమైన చరిత్రను తెలియజేయడానికి ఏర్పాటైన పుసక్త ప్రదర్శనకు రాష్ట్ర ప్రభుత్వం సముచిత గౌరవం ఇస్తుందన్నారు. బుక్ ఫెయిర్ ప్రారంభోత్సవంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణరావు, ఎమ్మెల్సీ కోదండరామ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, హెచ్‌బీఎఫ్ అధ్యక్షుడు డా.యాకూబ్ షేక్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్
- మొహర్రం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- భారత పాస్‌పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. ఇది కేవలం ప్రయాణ పత్రం మాత్రమే: విదేశాంగ శాఖ
- డెకాయ్ ఆపరేషన్లతో పోలీసుల బాగోతం బట్టబయలు: సీపీ సజ్జనార్
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్‌లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్







