వైకుంఠ ఏకాదశి దర్శన, వసతి కోటా విడుదల తేదీలివే..
- December 21, 2024
తిరుమల: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి 10 నుంచి 19 వరకు పది రోజుల పాటు జరిగే వైకుంఠ వైకుంఠ ద్వార దర్శనాల కోసం డిసెంబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
అలాగే పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను డిసెంబర్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.
ఈ నేపథ్యంలో మార్చి నెల శ్రీవాణి, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల కోటా విడుదల తేదీలను మార్చారు. మార్చి నెలకు సంబంధించిన శ్రీవాణి టిక్కెట్ల కోటాను డిసెంబర్ 25న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.
డిసెంబర్ 26వ తేదీ ఉదయం 11 గంటలకు మార్చి నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల కోటాను విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమలలోని డార్మెటరీ గదుల కోటాను విడుదల చేయనున్నారు.
ఈ మార్పును గమనించి, భక్తులు టిటిడి వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.in లో మాత్రమే టిక్కెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!







