‘అల్ మక్తూమ్ ఆర్కైవ్స్’ను ప్రకటించిన షేక్ మహమ్మద్..!!
- December 21, 2024
దుబాయ్: యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్.. అల్ మక్తూమ్ ఆర్కైవ్స్ను స్థాపించారు. ఇది దుబాయ్ పాలకులు, అల్ మక్తూమ్ చారిత్రక సాంస్కృతిక వారసత్వాన్ని డాక్యుమెంట్ చేసే బాధ్యతలను చేపట్టనుంది. అల్ మక్తూమ్ ఆర్కైవ్స్ ఏర్పాటుకు సంబంధించి షేక్ మహమ్మద్ 2024లో లా నంబర్ (28)ని జారీ చేశారు. ఈ చట్టం అల్ మక్తూమ్ ఆర్కైవ్స్ కార్పొరేషన్ అనే ప్రభుత్వ సంస్థను ఏర్పాటు చేసింది. అల్ మక్తూమ్ ఆర్కైవ్స్ దుబాయ్ పాలకులు, అల్ మక్తౌమ్ కుటుంబానికి చెందిన స్పష్టమైన సాంస్కృతిక వారసత్వాన్ని డాక్యుమెంట్ చేయడానికి మరియు సంరక్షించనుంది.
దీంతోపాటు, ఆర్కైవ్స్ ప్రచురణలతోపాటు మీడియా ఛానెల్ల ద్వారా దుబాయ్ పాలకుల మేధో, మానవతా , సాంస్కృతిక వారసత్వాన్ని వ్యాప్తి చేస్తుంది. ఎమిరేట్ అభివృద్ధిక, యూఏఈని స్థాపించడంలో వారి పాత్రను హైలైట్ చేయనుంది.అల్ మక్తూమ్ కుటుంబం, ఎమిరేట్ చారిత్రక మైలురాళ్లపై పరిశోధన చేసి డాక్యుమెంట్ చేయనున్నారు. ఈ రికార్డులను భద్రపరచడానికి సమగ్ర డిజిటల్ ఆర్కైవ్ ఏర్పాటు చేయబడుతుంది.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







