యూఏఈలో కిండర్ గార్టెన్ నుండి గ్రేడ్ 12 విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు..!!
- December 21, 2024
యూఏఈ: యూఏఈ విద్యార్థులకు వార్షిక పాఠశాల ఆరోగ్య పరీక్షలను నిర్వహించనున్నారు. ఎమిరేట్ వ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ మార్గదర్శకాలను విడుదల చేశారు. నేషనల్ స్కూల్ హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలను ప్రారంభించింది. విద్యార్థుల ఆరోగ్య సంరక్షణ ప్రయత్నాలను ముమ్మరం చేసేందుకు, వారిలో ఆరోగ్య సమస్యలను గుర్తించేందుకు ఇది దోహదం చేస్తుందని అధికారులు తెలిపారు.
ఆరోగ్య, నివారణ మంత్రిత్వ శాఖ (మొహాప్) ఆధ్వర్యంలో కిండర్ గార్టెన్ నుండి గ్రేడ్ 12 వరకు చదివే విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా దృష్టి, వినికిడి, దంత ఆరోగ్య పరీక్షలతోపాటు మానసిక, ప్రవర్తనా సమస్యలపైనా ఫోకస్ పెట్టనున్నారు. అదే విధంగా 10 ఏళ్లు పైబడిన విద్యార్థుల్లో ధూమపాన అలవాట్లపై పర్యవేక్షణ పరీక్షలను కూడా నిర్వహిస్తారు. వివిధ వయస్సు స్థాయిలలోని విద్యార్థులకు అనుగుణంగా వైద్య పరీక్షలను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇది భవిష్యత్తు తరాలను సరైన ఆరోగ్యం, సంసిద్ధతతో సిద్ధం చేయడంతోపాటు స్థిరమైన భవిష్యత్తును నిర్మించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పబ్లిక్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ డాక్టర్ హుస్సేన్ అబ్దుల్ రహ్మాన్ అల్ రాండ్ అన్నారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







