ప్రధాని మోదీ కమ్యూనిటీ కార్యక్రమానికి సన్నాహాలు పూర్తి..!!

- December 21, 2024 , by Maagulf
ప్రధాని మోదీ కమ్యూనిటీ కార్యక్రమానికి సన్నాహాలు పూర్తి..!!

కువైట్: భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కువైట్‌లో రెండు రోజుల అధికారిక పర్యటనకు రానున్నారు.  ఈ సందర్భంగా శనివారం భారతీయ కమ్యూనిటీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కువైట్‌లోని సబా అల్ సేలం ప్రాంతంలోని షేక్ సాద్ అల్ అబ్దుల్లా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ప్రధాని మోదీ 'హలా మోదీ' కమ్యూనిటీ ఈవెంట్‌కు సన్నాహాలు పూర్తయ్యాయి. ఇండోర్ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి దాదాపు 4,000 నుండి 5,000 మంది హాజరయ్యే అవకాశం ఉంది.

కువైట్ అమీర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ ఆహ్వానం మేరకు కువైట్‌కు తన రెండు రోజుల అధికారిక పర్యటనలో కమ్యూనిటీ కార్యక్రమంలో భాగంగా భారతీయ ప్రవాసులతో మాట్లాడతారు.అనంతరం కార్మిక శిబిరాన్ని కూడా సందర్శిస్తారు. 43 సంవత్సరాలలో ఒక భారత ప్రధాని కువైట్‌ సందర్శించడం ఇదే తొలిసారి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com