సీఎం సూచన మేరకు కిమ్స్‌ ఆస్పత్రికి మంత్రి కోమటిరెడ్డి, 25 లక్షల సాయం ప్రకటన

- December 21, 2024 , by Maagulf
సీఎం సూచన మేరకు కిమ్స్‌ ఆస్పత్రికి మంత్రి కోమటిరెడ్డి, 25 లక్షల సాయం ప్రకటన

హైదరాబాద్: పుష్ప 2 రిలీజ్ సమయంలో జరిగిన తొక్కిసలాటలో గాయపడి హైదారాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కొడుకు శ్రీతేజ్‌ను పరామర్శించడానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆసుపత్రికి వెళ్లారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు ఆయన ఆస్పత్రికి వెళ్లారు. శ్రీతేజ, సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడ్డాడు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీతేజ్‌కు మెరుగైన వైద్యం అందించేందుకు మంత్రి కోమటిరెడ్డి తన వ్యక్తిగత ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా రూ.25 లక్షల సాయం అందించనున్నట్లు ప్రకటించారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా సహాయం అందిస్తామని, శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్ని రోజులు ఇకపై బెనిఫిట్ షో లు ఉండవు అని స్పష్టం చేసారు.అలాగే టికెట్ ధరల ను కూడా పెంచబోము అని చెప్పారు. ఇక అనుమతి లేకుండా హీరోలు ఎవరు సినిమా థియేటర్లకు వెళ్లినా కఠినంగా వ్యవహరిస్తాం అని స్పష్టం చేశారు.

ఈ ఘటనపై ప్రభుత్వం దృష్టి సారించి, బాధితులకు తగిన న్యాయం చేయాలని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.ఆయన ఆస్పత్రి సిబ్బందిని, డాక్టర్లను కలసి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com