వాహనాలకు ఎల్ఈడీ లైట్లు వాడకూడదా?
- December 21, 2024
ప్రస్తుతం ఎల్ఈడీ లైట్లు వాహనాలకు ఉపయోగించాలా వద్దా అనే అంశంపై చాలా పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. సాధారణంగా ఎల్ఈడీ లైట్లు తక్కువ విద్యుత్ వినియోగించి ఎక్కువ కాంతిని ఇస్తాయి. వాహనాలకు ఎల్ఈడీ లైట్లు వాడటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, కొన్ని సందర్భాలలో ఈ లైట్లు ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది.ఎల్ఈడీ లైట్ల వాడకం ఎంతో ప్రయోజనకరంగా సౌకర్యంగా ఉన్నప్పటికీ వాటివల్ల ఉన్న లాభనష్టాలు తెలుసుకుందాం.
మొదటగా ఎల్ఈడీ లైట్లు సాధారణంగా ఎక్కువ కాంతిని ఉత్పత్తి చేస్తాయి. దీంతో రాత్రి సమయంలో డ్రైవింగ్ మరింత సురక్షితం అవుతుంది. ఇక రెండవది ఈ లైట్లు తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తాయి కనుక వాహనాల బ్యాటరీపై తక్కువ భారం పడుతుంది. దీని వల్ల బ్యాటరీ జీవితకాలం పెరుగుతుంది మరియు ఇంధన సామర్థ్యం మెరుగుపడుతుంది.
ఇక మూడవది ఎల్ఈడీ లైట్లు ఎక్కువ కాలం పనిచేస్తాయి అంటే వాటిని తరచుగా మార్చాల్సిన అవసరం ఉండదు. ఇది నిర్వహణ ఖర్చులను తగ్గిస్తుంది. ఈ లైట్లు తక్కువ వేడి ఉత్పత్తి చేస్తాయి, ఇది వాహనాల ఇతర భాగాలపై ప్రభావం చూపకుండా ఉంటుంది. ఎల్ఈడీ లైట్లు తక్షణమే పూర్తి కాంతిని ఉత్పత్తి చేస్తాయి, అంటే వాటిని ఆన్ చేసిన వెంటనే పూర్తి కాంతి అందుతుంది. ఎల్ఈడీ లైట్లు వర్షం, పొగమంచు లేదా చీకటి సమయంలో చాలా ప్రకాశవంతంగా స్పష్టంగా కనిపిస్తాయి. ఈ సమయంలో స్పష్టంగా రహదారిని చూసే అవకాశం ఉండడంతో డ్రైవింగ్ ఈజీ అవుతుంది.
అయితే ఎల్ఈడీ లైట్ల వలన కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా, హైబీమ్ ఎల్ఈడీ లైట్లు ఎదురుగా వచ్చే వాహనదారులకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఈ లైట్లు చాలా ప్రకాశవంతంగా ఉండటం వల్ల ఎదురుగా వచ్చే డ్రైవర్లకు రోడ్డు స్పష్టంగా కనిపించక ప్రమాదాలకు దారి తీస్తుంది. ఇందుకు ప్రధాన కారణం ఎల్ఈడీ లైట్లను సరిగ్గా అమర్చకపోవడమే. వీటిని సరిగ్గా అమర్చి సరైన కోణంలో ఉంచితే ఈ సమస్యలు తగ్గించవచ్చు.
చాలామంది డ్రైవర్లు ఈ విషయంలో అవగాహన లేక రాత్రి వేళల్లో హై భీమ్ ఉపయోగిస్తూ ఎదురుగా వచ్చే వాహనాలను పట్టించుకోకుండా ఎక్కువ డెప్త్ ఉన్న లైట్లను వాడుతున్నారు. డెప్త్ ఎక్కువగా ఉండటం వలన ముందు వాహనాల డ్రైవర్స్‌కు ఎదురుగా వచ్చే వాహనాలు, రోడ్డు మార్గం కనిపించక ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలను నివారించాలంటే వాహనాల తయారీదారులు మరియు లైట్ల తయారీదారులు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని, ఎల్ఈడీ లైట్లను సురక్షితంగా వాడే విధంగా రూపొందిస్తే ప్రమాదాలను అరికట్టవచ్చు. ఇంకా ఎల్ఈడీ లైట్లను సరైన రీతిలో ఎలా ఉపయోగించాలో వాహన తయారీ కంపెనీలు డ్రైవర్లకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. కానీ ఏ ఒక్క కంపెనీ కూడా ఇప్పటివరకు ఇలాంటి పనికి పూనుకోలేదు.
ఎల్ఈడీ లైట్లు ఎక్కువగా నీలం రంగులో ఉంటాయి కనుక ఈ లైట్లు కంటి సమస్యలకు కారణం కావచ్చు అని పలువురు అభిప్రాయం చేస్తున్నారు.కానీ ఈ విషయంపై సరైన స్పష్టత లేదు. ఎల్ఈడి లైట్ల కాంతితో కండ్లకు ఎంతవరకు ప్రమాదం అనే విషయంపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.కొన్ని దేశాలలో ఎల్ఈడీ లైట్ల వినియోగం పై ప్రత్యేక నియంత్రణలు ఉన్నాయి.కానీ మన దేశంలోని రోడ్డు భద్రతా నిబంధనల విషయంలో ఎల్ఈడీ లైట్ల వినియోగించకూడదు అనే నిబంధన ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి నియంత్రణలు లేవు. కొన్ని ప్రధాన నగరాల్లో రాత్రిపూట హై భీమ్ వాడకుండా లో భీమ్ వాడాలనే నిభందనలు ఉన్నప్పటికీ ఎల్ఈడీ లైట్ల విషయంలో ఇప్పటివరకు నియంత్రణలు లేవు.
ఎల్ఈడీ లైట్లు వాహనాలకు అనేక ప్రయోజనాలు కలిగిస్తాయి, కానీ వాటిని సరైన రీతిలో వాడకపోతేనే సమస్యలు ఎదురవుతాయి. డ్రైవర్లు ఎల్ఈడీ లైట్లను వాడేటప్పుడు ఎదుటివారికి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తగా ఉండాలి.ఎల్ఈడీ లైట్లు అధునాతనంగా మరియు ప్రయోజనకరంగా ఉంటాయి కానీ అవి సరైన నియంత్రణలతో మరియు భద్రతా నిబంధనలతో వాడితే మంచిది. వాహన డ్రైవింగ్ భద్రత కోసం ఎప్పుడూ కచ్చితమైన నియంత్రణలు పాటించడం ముఖ్యమే.
--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్‌రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







