బహ్రెయిన్ లో జనవరి 23 నుండి ఫిబ్రవరి 1వరకు ‘ఆటం ఫెయిర్’..!!
- December 22, 2024
మనామా: ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్ ది ఆటం ఫెయిర్ 35వ ఎడిషన్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఇది జనవరి 23 నుండి ఫిబ్రవరి 1వరకు ప్రపంచవ్యాప్తంగా విస్తృత శ్రేణి ఎగ్జిబిటర్‌ల భాగస్వామ్యంతో కొనసాగుతుంది. బహ్రెయిన్ టూరిజం, ఎగ్జిబిషన్స్ అథారిటీ సీఈఓ సారా బుహిజీ మాట్లాడుతూ.. బహ్రెయిన్ ఆటం ఫెయిర్ కీలకమైన ఈవెంట్‌లలో ఒకటి అన్నారు. ఈ కార్యక్రమం పర్యాటక రంగాన్ని మెరుగుపరచడానికి, స్థానిక ఆర్థిక వ్యవస్థకు మద్దతునిస్తుందని పేర్కొన్నారు. ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్‌లోని సందర్శకులకు సౌకర్యవంతమైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తుందన్నారు. ఇన్‌ఫార్మా మార్కెట్స్ జనరల్ మేనేజర్ మొహమ్మద్ ఇబ్రహీం మాట్లాడుతూ..ఈ సంవత్సరం ఫెయిర్ 35 విజయాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. అత్యుత్తమ రిటైల్‌ను ప్రదర్శించే ఈవెంట్‌ను నిర్వహించడం తమకు గర్వంగా ఉందని అన్నారు. సందర్శకులందరికీ ప్రవేశం ఉచితం. అయితే సాఫీగా యాక్సెస్‌ని నిర్ధారించడానికి http://www.theautumnfair.com వెబ్‌సైట్ ద్వారా ప్రీ-రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
రోజువారీ షెడ్యూల్: ఫెయిర్ ప్రతిరోజూ ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 2:00 వరకు.. సాయంత్రం 4:00 నుండి రాత్రి 10:00 వరకు ఉంటుంది. చివరి రెండు రోజులలో (జనవరి 31, ఫిబ్రవరి 1) 10:00 AM నుండి 10:00 PM వరకు తెరిచి ఉంటుంది. జనవరి 26, 27వ తేదీల్లో మహిళలకు ప్రత్యేకించారు.
పార్కింగ్: బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో ఉచిత పార్కింగ్ అందుబాటులో ఉంది.
బస్సు రవాణా సేవలు: బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్, ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్ వద్ద పార్కింగ్ ప్రాంతం మధ్య ఉచిత షటిల్ బస్సులు నడుస్తాయి.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







