ఖతార్‌లో మరింత మందికి అందుబాటులోకి మానసిక ఆరోగ్య సేవలు..!!

- December 22, 2024 , by Maagulf
ఖతార్‌లో మరింత మందికి అందుబాటులోకి మానసిక ఆరోగ్య సేవలు..!!

దోహా: మానసిక ఆరోగ్య సేవలను మరింత విస్తరించనున్నట్లు  హమద్ మెడికల్ కార్పొరేషన్ (HMC) వెల్లడించింది. విస్తరణలో భాగంగా మెంటల్ హెల్త్ సర్వీస్ (MHS), ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్ (PHCC) సహాయంతో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ నేపధ్యంలో ఇంటిగ్రేటెడ్ క్లినిక్‌లలో తమ స్పెషలిస్ట్‌ సేవలను మరింత విస్తరించనున్నట్లు ప్రకటించాయి. PHCC సౌకర్యాలలో 24 స్పెషలిస్ట్ క్లినిక్‌లను ప్రారంభించనున్నట్లు తెలిపింది. మానసిక ఆరోగ్య నిర్ధారణ, చికిత్స , సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొంది.

అల్ వాబ్ హెల్త్ సెంటర్, అల్ సద్ ఆరోగ్య సెంటర్, అల్ మషాఫ్ హెల్త్ సెంటర్, ఖతార్ విశ్వవిద్యాలయ హెల్త్ సెంటర్, అల్ వాజ్బా హెల్త్ సెంటర్ లలో సేవలు అందుబాటులో ఉంటాయని HMCలోని సైకియాట్రీ చైర్మన్ మాజిద్ అల్ అబ్దుల్లా తెలిపారు. ఈ విస్తరణ రోగులకు ప్రయోజనం కలిగించడమే కాకుండా, సల్వా రోడ్‌లోని మా ఆసుపత్రిని పునరాభివృద్ధిని పూర్తి చేసే అవకాశాన్ని మాకు అందిస్తుందని పేర్కొన్నారు.  

PHCC సీనియర్ కన్సల్టెంట్ ఫ్యామిలీ ఫిజిషియన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ డాక్టర్ సామ్య అల్ అబ్దుల్లా మాట్లాడుతూ..ప్రాథమిక సంరక్షణలో స్పెషలిస్ట్ మెంటల్ హెల్త్ సేవలను విస్తరించడం ద్వారా, రోగులు ఆరోగ్యానికి సమగ్ర విధానం నుండి ప్రయోజనం పొందుతారని పేర్కొన్నారు. ఇది శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలను ఏకకాలంలో నిర్వహించడానికి అనుమతిస్తుందని, ఇది మెరుగైన ఆరోగ్య ఫలితాలను ఇస్తుందని తెలిపారు.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com