రాయల్ ఒపేరా హౌస్ మస్కట్.. జనవరిలో అద్భుత ప్రదర్శనలు..!!

- December 24, 2024 , by Maagulf
రాయల్ ఒపేరా హౌస్ మస్కట్.. జనవరిలో అద్భుత ప్రదర్శనలు..!!

మస్కట్: రాయల్ ఒపేరా హౌస్ మస్కట్ (ROHM) తన థ్రిల్లింగ్ 2024/25 సీజన్‌ను జనవరి 2025లో అసాధారణమైన లైనప్‌తో తిరిగి వస్తుంది. ఇది ప్రపంచ స్థాయి ప్రదర్శనలతోపాటు అన్ని వయసుల వారికి ప్రత్యేక కార్యకలాపాలను నిర్వహిస్తుంది.

బ్యూటీ అండ్ ది బీస్ట్ ఆన్ ఐస్.. జనవరి 2,3,4 తేదీల్లో బ్రిటిష్-ఒమానీ ఐస్-స్కేటింగ్ ఛాంపియన్ అమాని ఫ్యాన్సీ ప్రదర్శన ఉంది. మాయా మంచుతో నిండిన వండర్‌ల్యాండ్‌ను ఆనందించవచ్చు. జనవరి16, 17వ తేదీల్లో ఫోక్ మ్యూజిక్ ఫెస్టివల్ ఆకట్టుకోనుంది.ఇందులో బల్గేరియా, దక్షిణ కొరియా,  పరాగ్వే జానపద కళాకారులు తరలిరానున్నారు. రాయల్ ఒపేరా హౌస్ ఆఫ్ మ్యూజికల్ ఆర్ట్స్ మైదానంలో ఈ కార్యక్రమం జరుగనుంది.   జనవరి 24న యువ మారిన్స్కీ సోలో ప్రదర్శన ఉంటుంది. వీటితోపాటు జనవరి క్యాలెండర్‌లో ఉచిత ప్రవేశంతో కూడిన అనేక రకాల విద్యాచ, కమ్యూనిటీ ఈవెంట్‌లు సందర్శకుల కోసం ఆహ్వానం పలుకుతున్నాయి.  టిక్కెట్‌లు, షెడ్యూల్‌ల కోసం www.rohmuscat.org.om ని సందర్శించాలని నిర్వాహకులు సూచించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com