రాయల్ ఒపేరా హౌస్ మస్కట్.. జనవరిలో అద్భుత ప్రదర్శనలు..!!
- December 24, 2024
మస్కట్: రాయల్ ఒపేరా హౌస్ మస్కట్ (ROHM) తన థ్రిల్లింగ్ 2024/25 సీజన్‌ను జనవరి 2025లో అసాధారణమైన లైనప్‌తో తిరిగి వస్తుంది. ఇది ప్రపంచ స్థాయి ప్రదర్శనలతోపాటు అన్ని వయసుల వారికి ప్రత్యేక కార్యకలాపాలను నిర్వహిస్తుంది.
బ్యూటీ అండ్ ది బీస్ట్ ఆన్ ఐస్.. జనవరి 2,3,4 తేదీల్లో బ్రిటిష్-ఒమానీ ఐస్-స్కేటింగ్ ఛాంపియన్ అమాని ఫ్యాన్సీ ప్రదర్శన ఉంది. మాయా మంచుతో నిండిన వండర్‌ల్యాండ్‌ను ఆనందించవచ్చు. జనవరి16, 17వ తేదీల్లో ఫోక్ మ్యూజిక్ ఫెస్టివల్ ఆకట్టుకోనుంది.ఇందులో బల్గేరియా, దక్షిణ కొరియా, పరాగ్వే జానపద కళాకారులు తరలిరానున్నారు. రాయల్ ఒపేరా హౌస్ ఆఫ్ మ్యూజికల్ ఆర్ట్స్ మైదానంలో ఈ కార్యక్రమం జరుగనుంది. జనవరి 24న యువ మారిన్స్కీ సోలో ప్రదర్శన ఉంటుంది. వీటితోపాటు జనవరి క్యాలెండర్లో ఉచిత ప్రవేశంతో కూడిన అనేక రకాల విద్యాచ, కమ్యూనిటీ ఈవెంట్లు సందర్శకుల కోసం ఆహ్వానం పలుకుతున్నాయి. టిక్కెట్లు, షెడ్యూల్ల కోసం www.rohmuscat.org.om ని సందర్శించాలని నిర్వాహకులు సూచించారు.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







