అమెరికా అధ్యక్షుడు కీలక నిర్ణయం..37 మందికి క్షమాభిక్ష

- December 24, 2024 , by Maagulf
అమెరికా అధ్యక్షుడు కీలక నిర్ణయం..37 మందికి క్షమాభిక్ష

అమెరికా: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరికొన్ని రోజుల్లో పదవి నుంచి తప్పుకోబోతున్నారు. గతంలో ఆయన చెప్పినట్లుగానే అనేక మంది నేరస్తులకు శిక్ష తగ్గిస్తూ క్షమాభిక్షల పర్వం కొనసాగిస్తున్నారు. ఇటీవలే ఒక్కరోజులో 1500 మందికి క్షమాభిక్ష ప్రసాదించిన జో బైడెన్ ఈరోజు మరో 37 మందికి శిక్షను తగ్గించారు. ముఖ్యంగా మరణశిక్ష అనుభవిస్తున్న వీరికి జీవిత ఖైదును విధించారు.2003 నుంచి ట్రంప్‌ అధికారం చేపట్టే వరకు ఫెడరల్‌ ఖైదీలకు మరణశిక్ష అమలు చేయలేదు.ఆయన అధికారం చేపట్టిన తొలి ఆరు నెలల్లోనే 13 మందికి శిక్ష అమలు చేశారు.చివరగా జనవరి 16, 2021న ట్రంప్‌ అధికారం నుంచి దిగిపోయే నాలుగు రోజుల ముందు చివరి శిక్ష అమలయ్యింది. ప్రస్తుతం నలభై మంది ఈ జాబితాలో కొనసాగుతుండగా.. వీరిలో 37 మందికి క్షమాభిక్ష లభించింది. ఈక్రమంగానే ఆయన మాట్లాడుతూ.. హింసాత్మక నేరాలను తగ్గించడానికి, సమర్థవంతమైన న్యాయ వ్యవస్థను నిర్ధారించడానికి తన జీవితాన్ని అంకింత చేసినట్లు చెప్పుకొచ్చారు. జో బైడెన్ 2021లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఫెడరల్ ఉరిశిక్షలపై తాత్కాలిక నిషేధాన్ని ప్రకటించింది. ఇలా బైడెన్ పదవీ కాలం మొత్తం ఉరిశిక్షలను నిలిపివేశారు. 2020 సంవత్సరంలో ప్రచార హమీల్లో భాగంగానే ఫెడరల్ స్థాయిలో మరణశిక్షను తొలగించడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. ఆ హామీ మేరకే ఉరిశిక్షలను ఆపేశారు. అమెరికా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా మరణశిక్ష అమలు నిబంధనలు ఉన్నాయి. కొన్ని మాత్రమే వాటిని అమలు చేస్తుండగా.. అత్యంత తీవ్ర నేరాల్లో మాత్రం ఫెడరల్ ప్రభుత్వం తరఫున మరణ శిక్షలు విధిస్తున్నారు. ఇలా 1988 నుంచి 2021 వరకు 79 మందికి మరణ శిక్ష పడగా.. కేవలం 16 మందికి శిక్ష అమలు చేశారు. 2003 నుంచి ట్రంప్ అధికారంలోకి వచ్చే వవకు ఎలాంటి శిక్షలు అమలు కాలేదు. కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లోనే 13 మందికి మరణశిక్ష విధించారు. ప్రస్తుతం 40 మంది ఈ శిక్షలు అనుభవిస్తుండగా.. 37 మందికి బైడెన్ క్షమాభిక్ష ప్రసాదించారు. కానీ బోస్డన్ మారథాన్ బాంబు దాడి కేసులో మరణశిక్ష పడ్డ ముగ్గురు దోషులకు మాత్రం బైడెన్ క్షమాభిక్ష ప్రసాదించలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com