ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా క్రిస్‌మస్ వేడుకలు..
- December 25, 2024
ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు క్రిస్‌మస్ వేడుకలను జరుపుకుంటున్నారు. చర్చిలు గత రాత్రి నుంచి విద్యుద్దీపాల అలంకరణలతో కనపడుతున్నాయి. కేరళలోని ఎర్నాకులంలోని సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సిసి రోమన్ క్యాథలిక్ మెట్రోపాలిటన్ కేథడ్రల్‌ను లైట్లు, క్రిస్మస్ క్రిబ్‌లతో అందంగా అలంకరించారు.
మెదక్ చర్చలో… ఇక తెలంగాణలోని మెదక్ కెథడ్రల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నేటి తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రాతఃకాల ఆరాధనతో మెదక్ చర్చిలో క్రిస్మస్ మహోత్సవం ప్రారంభమైంది. చర్చి ఆనవాయితీ ప్రకారం శిలువను ఉరేగింపుగా తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. ఇన్‌చార్జి బిషప్ రైట్ రెవరెండ్ రూబెన్ మార్క్ భక్తులకు దైవవాక్య సందేశం ఇచ్చారు. మెదక్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మెదక్ చర్చిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. చిన్నారులకు వినోదం పంచేందుకు చర్చి ఆవరణలో రంగులరాట్నం ఏర్పాటు చేశారు. ముప్పై ఏళ్ల క్రితం చిన్న పాకలో ప్రార్ధనలతో మొదలైనది అంచెలంచెలుగా విస్తరించింది. నేడు, ఇది ఆసియాలోనే అతిపెద్ద చర్చిగా మారింది. ఇది ఒకేసారి 40 వేల మందికి పైగా ప్రార్థన చేయడానికి సౌకర్యాలను కలిగి ఉంది.
ఖమ్మం జిల్లాలో
ఏసు ప్రభువు జన్మదినం సందర్భంగా క్రిస్మస్ పండుగను ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా క్రైస్తవులు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. ఈ పండుగకు సర్వాంగ సుందరంగా చర్చీలు ముస్తాబు అయ్యాయి. క్రైస్తవ మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఖమ్మం నగరంలోని సీఎస్‌ఐ చర్చిలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వేడుకల్లో పాల్గొని ప్రార్థనలు చేశారు. మంత్రి మాట్లాడుతూ.. క్రైస్తవులందరికి క్రిస్‌మస్ శుభాకాంక్షలు తెలిపారు.
వరంగల్ జిల్లాలో
హనుమకొండ జిల్లా కరుణాపురం క్రీస్తు జ్యోతి చర్చి ప్రార్థనలతో మార్మోగింది. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని చర్చి పరిసరాలను విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా తీర్చిదిద్దారు. ప్రార్థనా మందిరం క్రైస్తవ ఆరాధన, పాటలు , దేవుని పదాల పఠనంతో నిండిపోయింది. వరంగల్ జిల్లాలో క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. కాజీపేటలోని పలు ప్రార్థనా మందిరాలు విద్యుద్దీపాలతో దేదీప్యమానంగా వెలిశాయి. రాత్రి ప్రత్యేక పూజలు భక్తులను అలరించాయి. కాజీపేటలోని ఫాతిమానగర్ చర్చిలో అర్ధరాత్రి జరిగిన క్రిస్మస్ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
ఎపిలో… ఎపిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.. గుణదల మేరిమాత చర్చికి భక్తులు నేడు పోటెత్తారు.. ఈ సందర్భంగా ఇక్కడ ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు.. అలాగే ఎపిలో చర్చిలలో నేడు ప్రత్యేక కార్యక్రమాలు జరిపారు.
ప్రముఖుల శుభాకాంక్షలు
ఇక తెలంగాణ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు బోధనలు ప్రపంచంలో మానవాళికి ఎప్పటికీ మార్గదర్శకంగా నిలుస్తాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏసు ప్రభువు ఆశయాలను గౌరవించేందుకు క్రిస్మస్ సంతోషకరమైన సందర్భమని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కూడా క్రైస్తవులకు క్రిస్మస్ గ్రీటింగ్ తెలిపారు.. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన క్రిస్మస్ సందేశంలో క్రీస్తు బోధనలు సర్వదా ఆచరణీమని అన్నారు.



తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







