ఫ్లైట్ టైరులో డెడ్ బాడీ
- December 26, 2024
హవాయి ద్వీపంలోని కహులుయీ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన ఓ విమానం టైరులో అధికారులు మృతదేహాన్ని గుర్తించా రు. అమెరికాలో షికాగోలోని ఓహే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ విమానం వచ్చింది.ఈ డెడ్ బాడీ ఎలా వచ్చిందనే అంశంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విమానం బయటి నుంచి మాత్రమే ఎవరైనా వీల్ వెల్లోకి వెళ్లగలరు. అయితే, ఆ వ్యక్తి అక్కడకు ఎలా చేరాడనేది తెలియాల్సి ఉందని ఎయిర్లైన్స్ అధికారులు అంటున్నారు. అలాగే మృతుడి వివరాలను ఆరా తీస్తున్నారు. చట్టవిరుద్ధంగా ప్రయాణించడానికి ప్రయత్నించే వ్యక్తులు ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు ఈ తరహా రిస్క్ చేస్తుంటారు. ఇలాంటి ప్రయత్నాలు చేసిన వారు సజీవంగా బయటపడే అవకాశాలు చాలా తక్కువ.
తాజా వార్తలు
- క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అజారుద్దీన్
- తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా తగ్గిన చలితీవ్రత
- దుర్గమ్మ నినాదాలతో మార్మోగుతున్న బెజవాడ
- ఇక అన్ని ఆలయాల్లో యుపిఐ చెల్లింపులు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్
- NATS సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు
- బహ్రెయిన్ గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఇండియన్ స్కూల్..!!
- కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!







