డిసెంబర్ 28న యూఏఈ లాటరీ డ్రా.. మొదటి 11మందికి Dh100,000..!!

- December 27, 2024 , by Maagulf
డిసెంబర్ 28న యూఏఈ లాటరీ డ్రా.. మొదటి 11మందికి Dh100,000..!!

యూఏఈ: మొదటి యూఏఈ లాటరీ డ్రాలో తొలి 11 మంది విజేతలు ఒక్కొక్కరికి Dh100,000 ప్రకటించిన తర్వాత ఉత్కంఠ పెరిగిందని ఆపరేటర్ చెప్పారు. డిసెంబర్ 14న జరిగిన మొదటి డ్రాలో అసాధారణమైన డిమాండ్‌ వచ్చిందని, ఇప్పటికే 29,000 మందికి పైగా విజేతలను గుర్తించినట్లు తెలిపారు. డిసెంబర్ 28న రెండవ డ్రా జరుగనుందని పేర్కొన్నారు.  .

మొదటి డ్రాలో, మొదటి రెండు బహుమతులు Dh100 మిలియన్, Dh1 మిలియన్లు క్లెయిమ్ కాలేదన్నారు. బహుమతులు ఆటోమెటిక్ గా పాల్గొనేవారి ఖాతాలలో జమవుతుందన్నారు. "డ్రా తర్వాత, మా ప్రైజ్ క్లెయిమ్ కమిటీ గెలిచిన పార్టిసిపెంట్‌లను సంప్రదిస్తుంది. ప్రత్యేకమైన 'విజేత వేడుక'కి హాజరు కావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తుంది. మేము విజేతలను మా సోషల్ మీడియా ఛానెల్‌లలో ప్రకటిస్తాము. చెల్లింపు ప్రక్రియను సులభతరం చేస్తాము. మా విజేతల లభ్యతను బట్టి , ఈ మొత్తం ప్రక్రియ కొన్ని రోజుల నుండి కొన్ని వారాల వరకు ఉంటుంది" అని ఆపరేటర్ చెప్పారు.

లాటరీ Dh100 మిలియన్ల జాక్‌పాట్‌ను అందిస్తుందని, రెండవ బహుమతి 1 మిలియన్ లతోపాటు Dh100 మరియు Dh100,000 మధ్య ఇతర మొత్తాలను విజేతలకు అందజేస్తామని తెలిపారు. వీటితోపాటు ఏడు 'లక్కీ ఛాన్స్ IDలు' ఒక్కొక్కటి Dh100,000 గెలుచుకోవడం గ్యారెంటీ అని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com