రియాద్‌లో నకిలీ ప్రొడక్ట్స్ వేర్ హౌజ్ సీజ్..!!
- December 27, 2024
            రియాద్: రియాద్‌లోని దక్షిణ అల్-ఫైసాలియా పరిసరాల్లో ఒక ఆసియా నివాసి నిర్వహిస్తున్న వేర్ హౌజ్ ని వాణిజ్య మంత్రిత్వ శాఖ తనిఖీ బృందాలు సీజ్ చేశాయి. అందులోంచి 33వేల నకిలీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఆసియన్ నివాసితోపాటు పలువురిని అరెస్టు చేసి, వారిపై చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేయడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేశారు. ఈ మేరకు జకాత్, పన్ను, కస్టమ్స్ అథారిటీ వెల్లడించింది. సౌదీ అథారిటీ ఫర్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ , సెక్యూరిటీ ఏజెన్సీల సహకారంతో సంయుక్తంగా తనిఖీలు చేపట్టినట్టు తెలిపింది.
స్వాధీనం చేసుకున్న నకిలీ వస్తువులలో 33,459 దుప్పట్లు, 28వేల బ్యాగులు, నకిలీకి ఉపయోగించే ప్రింటెడ్ మెటీరియల్స్ ఉన్నాయి. యాంటీ-కవర్-అప్ చట్టం, యాంటీ-కమర్షియల్ ఫ్రాడ్ చట్టంలోని నిబంధనల ప్రకారం.. నేరం రుజువైతే నిందితులకు ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష, SR5 మిలియన్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
 - నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
 - సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
 - DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
 - సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!
 - బహ్రెయిన్ లో 52 నకిలీ సంస్థలు.. 138 వర్క్ పర్మిట్లు..!!
 - లండన్‌లో సీఎం చంద్రబాబు–యూకే హైకమిషనర్‌తో భేటీ
 - హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్..
 - కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
 - భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025
 







