ఉత్తర ప్రాంతాలలో తీవ్రమైన చలి..మైనస్ ఉష్ణోగ్రతలు..!!

- December 28, 2024 , by Maagulf
ఉత్తర ప్రాంతాలలో తీవ్రమైన చలి..మైనస్ ఉష్ణోగ్రతలు..!!

జెడ్డా: సౌదీ అరేబియాలోని కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 4 –జీరో డిగ్రీల సెల్సియస్ మధ్య కనిష్ట స్థాయికి పడిపోతాయని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ వెల్లడించింది. ఈ వింటర్ వాతావరణ పరిస్థితులు ఎక్కువగా ఉత్తర ప్రాంతాలైన టబుక్, అల్-జౌఫ్, ఉత్తర సరిహద్దులతోపాటు మదీనా ప్రాంతంలోని ఉత్తర ప్రాంతాలలో జనవరి 3 వరకు కొనసాగుతాయని తెలిపింది. అదే విధంగా ఉత్తర సరిహద్దులు, తబుక్, అల్-జౌఫ్ ప్రాంతాలను చల్లటి గాలి కవర్ చేస్తుందన్నారు. ఆయా ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సున్నా -మైనస్ 4 మధ్య ఉన్నాయని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ ప్రతినిధి హుస్సేన్ అల్-ఖహ్తానీ తెలిపింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com