బహ్రెయిన్ లో రియల్ ఊపు..భారీగా పెరిగిన రెసిడెన్షియల్ ల్యాండ్..!!
- December 28, 2024
మనామా: అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (UPDA) నవంబర్ 2024లో రెసిడెన్షియల్ ల్యాండ్ విస్తీర్ణంలో గణనీయమైన పెరుగుదలను నివేదించింది. డేటా ప్రకారం.. రెసిడెన్షియల్ ల్యాండ్ 208,000 చదరపు మీటర్ల విస్తరించింది. దాంతో మొత్తం రెసిడెన్షియల్ ల్యాండ్ 79 మిలియన్ చదరపు మీటర్లకు చేరింది. అక్టోబర్‌లో ఇది 78.8 మిలియన్ చదరపు మీటర్లుగా ఉంది. బహ్రెయిన్ మొత్తం భూభాగంలో ఇది 11.86%నికి సమానం.
నవంబర్‌లో నార్తర్న్ గవర్నరేట్ రెసిడెన్షియల్ ల్యాండ్ లో అత్యధిక వాటాను కలిగి ఉంది. మొత్తం 24.8 మిలియన్ చదరపు మీటర్లు (36%) కలిగి ఉంది. సదరన్ గవర్నరేట్ 22.3 మిలియన్ చదరపు మీటర్లతో, క్యాపిటల్ గవర్నరేట్ 20.4 మిలియన్ చదరపు మీటర్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ముహరక్ గవర్నరేట్ 11.3 మిలియన్ చదరపు మీటర్ల రెసిడెన్షియల్ ల్యాండ్ ని కలిగి ఉంది. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ ప్రాజెక్ట్‌ల కోసం కేటాయించిన భూమి 20.4 మిలియన్ చదరపు మీటర్ల వద్ద స్థిరంగా ఉంది.
తాజా వార్తలు
- గణేష్ నిమజ్జనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి: డీజీపీ సీవీ ఆనంద్
- ఆసియా క్రీడల విజేతలకు సీఎం విజయ్ భారీ నగదు బహుమతి
- హత్యకు గురైన వ్యక్తి భార్య, కుమారుడు అదృశ్యమయ్యారన్న వార్తలను ఖండించిన షార్జా పోలీసులు
- ఏపీలో టాటా పవర్..చిత్తూరులో ఈవీ ఛార్జింగ్ స్టేషన్
- దుబాయ్‌లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్‌లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!







