మహిళ కారుపై ' అభ్యంతరకరమైన' నోట్..యువకుడికి 1,000 దిర్హామ్‌ల జరిమానా..!!
- December 29, 2024
యూఏఈ: పబ్లిక్ డీసెన్సీ యాక్ట్ ను ఉల్లంఘించినందుకు దోషిగా తేలిన తర్వాత 19 ఏళ్ల ఎమిరాటికి 1,000 దిర్హామ్‌ల జరిమానా విధించారు. పోర్ట్ రషీద్ ప్రాంతంలోని కేఫ్ సమీపంలోని పబ్లిక్ పార్కింగ్ స్థలంలో జరిగిన ఈ సంఘటనలో యువకుడు ఒక మహిళ కారుపై అభ్యంతరకరమైన చేతిరాతతో రాసిన నోట్‌ను పెట్టాడు. అందులో అభ్యంతరకరమై, అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ సంఘటన నవంబర్ 10, 2023న జరిగింది. నోట్‌ను గుర్తించిన వెంటనే, భర్త దానిని ఫోటో తీసి తన భార్యకు పంపాడు. ఆమె వెంటనే సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అధికారులు విచారణ చేపట్టి, సీసీ ఫుటేజీని పరిశీలించి యువకుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తనకు కారు ఓనర్ ఎవరో తెలియదని, ఆమెతో ఎలాంటి ముందస్తు పరిచయం లేదని, సరదాగా రాసినట్లు విచారణలో నిందితుడు తన తప్పును ఒప్పుకున్నాడు.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







