తైఫ్‌లోని అల్-హదా రోడ్ జనవరి నుండి మూసివేత..!!
- December 31, 2024
రియాద్: తైఫ్ గవర్నరేట్‌లోని అల్-హదా రోడ్‌ను నిర్వహణ పనుల కోసం జనవరి 1 నుండి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు రోడ్స్ జనరల్ అథారిటీ (RGA) ప్రకటించింది. నిర్వహణ పనులు రెండు నెలల పాటు కొనసాగుతాయని భావిస్తున్నారు. రహదారి నాణ్యతను మెరుగుపరచడం, భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడం, ప్రయాణికుల భద్రత, నాణ్యత లక్ష్యాలకు అనుగుణంగా నిర్వాహణ పనులను చేపట్టనున్నారు. అల్సైల్ అల్‌కబీర్ రోడ్ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని RGA వాహనదారులకు సూచించింది.
రోడ్స్ సెక్టార్ స్ట్రాటజీ లక్ష్యాలలో 2030 నాటికి రోడ్ క్వాలిటీ ఇండెక్స్‌లో ఆరవ గ్లోబల్ ర్యాంకింగ్‌ను సాధించడం, రోడ్డు ప్రమాదాలను 100,000 మందికి 5 కంటే తక్కువకు తగ్గించడం, అంతర్జాతీయ రోడ్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ (iRAP)కు అనుగుణంగా భద్రతా చర్యలతో రహదారి నెట్వర్క్ ను అప్ గ్రేడ్ చేయనున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో 10 నెలల్లో 48,950 మందికి జరిమానాలు..!
- సౌదీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, దట్టమైన పొగమంచు..!!
- కువైట్‌లో కుళ్లిన మాంసం, చేపలు విక్రయిస్తున్న సంస్థపై దాడి..!!
- ఒమన్‌లో జాతీయ జెండాను అవమానిస్తే మూడేళ్ల జైలు శిక్ష..!!
- బహ్రెయిన్‌లో భారీ పెట్టుబడులకు రంగం సిద్ధం..!!
- ఖతార్‌లో ఉద్యోగం మానేస్తే.. ఫైనల్ సెటిల్మెంట్ ఎప్పటిలోగా చెల్లిస్తారు?
- కాంగోను వణికిస్తున్న ‘ఎబోలా’.. 5వేలకు పైగా మరణాలు
- దుబాయ్ రైడ్ 2026 విజయవంతం.. షేక్ జాయెద్ రోడ్డు పై సైక్లిస్టుల సందడి
- సౌదీ అరేబియా కస్టమ్స్ అధికారుల భారీ ఆపరేషన్..!!
- యూఏఈ లాటరీ తాజా విజేతలు.. ముగ్గురికి తలా Dh100,000..!!







