రైతు నేపథ్యంతో బాలకృష్ణ 101వ చిత్రం
- June 28, 2016
తన 101 చిత్రాన్ని రైతు నేపథ్యం ఉన్న కథతో చేస్తానని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని దేవనహళ్లి గ్రామంలో మంగళవారం ఆయన పర్యటించారు. గ్రామానికి వచ్చిన బాలకృష్ణకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. ముందుగా ఆయన గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం రైతులకు రుణమాఫీ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికలోటుతో ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన వారందరికీ రుణమాఫీ చేస్తామన్నారు. తనకు రైతులంటే ఎనలేని గౌరవమని... అందుకే తన 101 చిత్రాన్ని రైతు నేపథ్యం ఉన్న కథతో తీస్తానని చెప్పారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







