గల్ఫ్ దేశాల చెరశాలలో చిక్కుకున్న భారతీయుల ఇక్కట్లు
- June 28, 2016
ఉన్న ఊళ్లో బతుకుదామంటే కరువు పగపట్టింది. పొట్టకూటి కోసం పక్క దేశానికి వెళితే అమాయకత్వంతోనో, తెలిసీతెలియనితనంతోనో కేసుల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఉన్న ఊరికి రాలేక, ఉన్న చోట బ్రతకలేక నరకం అనుభవిస్తున్నారు. ఇది ఏ ఒక్కరి కథో కాదు. కొన్ని వందల మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో ఎదుర్కుంటున్న దయనీయ స్థితి. సౌదీ, దుబాయ్ దేశాలకు ఎన్నో కలలతో వెళ్లిన తెలుగు ప్రజలు ఆ కలలన్నీ కల్లలవడంతో కుమిలిపోతున్నారు. డ్రగ్స్ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న తెలుగువారి పరిస్థితి మరీ ఘోరం. గల్ఫ్ దేశాల్లో శిక్షలు అత్యంత కఠినంగా అమలు చేస్తారు. ఈ శిక్షలకు ఎంతోమంది తెలుగువారు బలైపోయారు. బలవుతూనే ఉన్నారు. ఏడాది క్రితం కడప జిల్లా సుండుపల్లికి చెందిన షేక్ సయ్యద్కి డ్రగ్స్ కేసులోనే మరణ శిక్ష పడింది. చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన ఓ వ్యక్తికి డ్రగ్స్ కేసులో మరణ శిక్ష పడింది. కడప జిల్లా సుండుపల్లికి చెందిన దాదాపీర్ కువైట్‌లో తన గదిలో డ్రగ్స్‌తో దొరికిపోయాడు. ప్రస్తుతం జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అంతేకాదు పలు కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న ముగ్గురు భారతీయులకు మరణ శిక్ష విధించారు. 2007-13 సంవత్సరాల మధ్య కువైట్‌లో ఉరిశిక్ష అమలును అక్కడి ప్రభుత్వం నిషేధించింది. పెరుగుతున్న అకృత్యాలను దృష్టిలో ఉంచుకుని 2013లో మళ్లీ ఉరిశిక్షను అమల్లోకి తెచ్చింది. ఆ సమయంలోనే వివిధ కేసుల్లో కొందరికి ఉరిశిక్ష పడింది. ఈ ఉరిని అమలు చేసే సమయంలో జర్నలిస్టులను పిలిచి మరీ శిక్షను విధించడం గల్ఫ్ దేశాల్లో మగ్గుతున్న తెలుగువారి దీన స్థితికి నిదర్శనం.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







