చిన్నారులు, మానసిక వికలాంగుల సంరక్షణకు ప్రత్యేక చట్టం

- July 09, 2015 , by Maagulf
చిన్నారులు, మానసిక వికలాంగుల సంరక్షణకు ప్రత్యేక చట్టం


బహ్రెయిన్ లో చిన్నారులను, మానసిక వికలాంగులు లేదా ఎదుగుదల లోపించినవారిని ప్రమాదాలు లేదా వేధింపుల నుండి సంరక్షించడానికై 1976 సంవత్సరం నాటి శిక్షాస్మృతిలోని ఆర్టికల్ 320ని సవరిస్తూ, హిజ్ మాజెస్టీ కింగ్ హమాద్, నిన్న ఆదేశాలు జారీ చేశారు. దీనిప్రకారం, 7 సం. లేదా అంతకన్నా తక్కువ వయస్సు గల పిల్లలను లేదా శారీరిక, మానసిక కారణాల వల్ల తమను తాము కాపాడుకోలేని స్థితిలో ఉన్నవారిని ప్రమాదానికి గురిచేసిన వారిని లేదా ఈ చర్యలకు ప్రోత్సహించిన వారిని 3 నెలల జైలుశిక్ష లేదా 100 బహ్రైనీ దీనారాల జరిమానా లేదా రెండూ విధించవచ్చు. నిర్జన ప్రదేశాలలో ఈవిధంగా ప్రవర్తించి చట్టాన్ని అతిక్రమించిన వారిని కనీసం 1 సం. జైలుశిక్ష విధించబడుతుంది.

 

--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com