ఒమాన్, అల్ దరాహ్ లో పట్టుబడిన మందుగుండు సామాగ్రి

- July 09, 2015 , by Maagulf
ఒమాన్, అల్ దరాహ్ లో పట్టుబడిన మందుగుండు సామాగ్రి

అల్ దరాహ్ సరిహద్దులో, 430 రకాల మందుగుండు సామాగ్రిని దొంగరవాణా చేసే ప్రయత్నాన్ని అల్ దరాహ్ బోర్డర్ పోస్టు వారు భగ్నం చేశారు. నిందితుడు, ఈ మందుగుండును కారు ట్రంకులో, తన సాధారణ వస్తువులతో కలిపి దాచిఉంచినట్టు తెలియవచ్చింది. ఇంకా, కారు పాసింజర్ సీటు కింద దాచిఉంచిన 400 రకాల మందుగుడును, అల్ వజజహ్ బోర్డర్ పోస్టులో స్వాధీనం చేసుకున్నారు. వాడీ సా బోర్డర్ పోస్టులో కూడా 33 మందుగుండు రకాలను స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లను అరస్టుచేసి, న్యాయవిచారణకై, అధికారులకు అప్పగించారు.
ఒమానీ శిక్షాస్మృతి ప్రకారం, మందుగుండు సామగ్రిని కలిగిఉండడం, పంపిణీచేయడం కూడా నేరమని, అందుకుగాను కనీసం 3 సంవత్సరాల జైలుశిక్ష లేదా 3,000 ఒమానీ రెయాల్ జరిమాన లేదా రెండూ కూడా విధించబడవచ్చునని, మరల ఇదే తప్పు చేస్తే శిక్ష రెట్టింపవుతుందని రాయల్ ఒమాన్ పోలీసు వారు హెచ్చరిస్తూ, ప్రజలను చట్టాలకు లోబడి, మార్గదర్శకాలను పాటించి మందుగుండు వలన జరిగే ప్రమాదాలను నివారించావల్సిందిగా కోరారు.


--నూనె లెనిన్ కుమార్(ఒమాన్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com