షాపింగ్ అనుభవాలకు కేంద్రంగా షాప్ ఖతార్ 2025..!!

- January 06, 2025 , by Maagulf
షాపింగ్ అనుభవాలకు కేంద్రంగా షాప్ ఖతార్ 2025..!!

మనామా: అతిపెద్ద షాపింగ్, ఎంటర్ టైన్ మెంట్ ఫెస్టివల్ షాప్ ఖతార్ 2025  జనవరి 1న ప్లేస్ వెండోమ్‌లో ప్రారంభమైంది. "మీ షాపింగ్ ప్లేగ్రౌండ్" అనే నేపథ్యంతో నెల రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్ ఫిబ్రవరి 1 వరకు జరుగుతుంది. విజిట్ ఖతార్‌లోని ఫెస్టివల్స్ & ఈవెంట్స్ డైరెక్టర్ అహ్మద్ అల్బినాలి మాట్లాడుతూ.. “ఈ సంవత్సరం షాప్ ఖతార్ ఎడిషన్ విజిట్ ఖతార్ ఈవెంట్ క్యాలెండర్‌లో ప్రతిష్టాత్మకమైన సంప్రదాయంగా మారింది. ఇది షాపింగ్, వినోదం, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ ను అందిస్తుంది. ఖతార్‌ను చిరస్మరణీయ అనుభవాలకు కేంద్రంగా మార్చుతుంది.’’ అని పేర్కొన్నారు. షాప్ ఖతార్ 2025 విలాసవంతమైన, హైస్ట్రీట్, స్థానిక రిటైలర్‌ల నుండి ప్రత్యేకమైన ఆఫర్‌లతో కూడిన యాక్షన్-ప్యాక్డ్ అనుభవాలను అందిస్తుందన్నారు.

ప్రతి శుక్రవారం వీక్లీ లాటరీ డ్రా నిర్వహిస్తారు. విజేతలకు లగ్జరీ ఎక్సీడ్ కార్లు, QAR 10,000 నుండి QAR 100,000 వరకు నగదు బహుమతులు,  టెస్లా సైబర్‌ట్రక్ బహుమతితో సహా అసాధారణమైన బహుమతులు అందజేస్తారు. సందర్శకులు గేమ్‌లు, రోమింగ్ పెరేడ్‌లు, స్పేస్‌టూన్ పాత్రలతో మీట్-అండ్-గ్రీట్‌లతో సహా ఇంటరాక్టివ్ యాక్టివిటీలను ఆస్వాదించవచ్చు. దోహా ఫెస్టివల్ సిటీలో ఫిబ్రవరి 1న ముగింపు వేడుకల్లో టెస్లా సైబర్‌ట్రక్ విజేత, ఇతర ప్రధాన బహుమతుల ప్రకటనతో చివరి రాఫిల్ డ్రాను నిర్వహిస్తారు.  ఈ సంవత్సరం షాప్ ఖతార్ ప్లేస్ వెండోమ్, దోహా ఫెస్టివల్ సిటీ, మాల్ ఆఫ్ ఖతార్, సిటీ సెంటర్ మాల్, ల్యాండ్‌మార్క్ మాల్, విల్లాజియో, లగూనా మాల్, అల్ హజ్మ్, హయత్ ప్లాజా, తవార్ మాల్, అల్ ఖోర్ మాల్, మషీరెబ్ గల్లెరియా , దోహా ఓల్డ్ పోర్ట్, లుసైల్ బౌలేవార్డ్, దోహా ఒయాసిస్, గల్ఫ్ మాల్, అబు సిద్రా మాల్, ది దోహా మాల్, ఎజ్దాన్ అల్ వక్రా, ది గేట్ మాల్ ప్రాంతాలలో జరుగుతుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com