మే 8 – 17: దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్..!!

- January 06, 2025 , by Maagulf
మే 8 – 17: దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్..!!

దోహా: దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ (DIBF) 34వ ఎడిషన్ దోహా ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్‌లో మే 8 నుండి 17 వరకు జరుగనుంది. ఈ మేరకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ  ఈ ప్రకటనలో తెలిపింది. ఇందులో ప్రపంచంలోని వివిధ దేశాల నుండి వందలాది ప్రచురణ సంస్థలు పాల్గొంటున్నాయి. దీనికి గల్ఫ్, అరబ్ దేశాల నుండి మాత్రమే కాకుండా ప్రపంచం నలుమూలల నుండి పుస్తక అభిమానులు హాజరవుతారు. బుక్ షో సందర్భంగా అనేక సాంస్కృతిక, ఇంటరాక్టివ్ కార్యకలాపాలను నిర్వహించనున్నారు. DIBF మొదటి ఎడిషన్ ఖతారీ బుక్స్ హౌస్ పర్యవేక్షణలో 1972లో ప్రారంభించారు.  33వ ఎడిషన్ 29వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో 42 దేశాల నుండి 515 మంది ప్రచురణకర్తలతో రికార్డును నెలకొల్పింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com