HMPV వైరస్ పై ఆందోళన వద్దు: కేంద్రం
- January 06, 2025
న్యూ ఢిల్లీ: దేశంలోకి వ్యాపించిన హ్యూమన్ మెటా ప్న్యూమో వైరస్ (HMPV) గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలిపారు.ఈ వైరస్ కొత్తది కాదని 2001లో గుర్తించినట్లు నిపుణులు స్పష్టం చేసినట్లు తెలిపారు.
చైనాను కరోనా వైరస్‌లా వణికిస్తున్న ఈ వైరస్ మనదేశంలో విస్తరిస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ లాక్డౌన్ వస్తుందేమోనన్న భయం ప్రజల్లో నెలకొంది.ఈ క్రమంలో సోమవారం హెచ్ఎంపీవీ వ్యాప్తి, కేసుల నమోదుపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సమీక్షించారు.
2001లోనే ఈ వైరస్‌ను గుర్తించగా.. నాటి నుంచి చాలా ఏళ్లుగా ప్రపంచం మొత్తం ఇది వ్యాపిస్తోందని చెప్పారు. శ్వాసక్రియ ద్వారా గాలిలోకి హెచ్ఎంపీవీ వ్యాపిస్తుందని అన్నారు. ఇది అన్ని వయసుల వ్యక్తులను ప్రభావితం చేస్తుందని తెలిపారు. శీతాకాలం, వసంత ఋతువు ఆరంభంలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ వ్యాప్తి పరిస్థితిని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గమనిస్తున్నదని, ఆ నివేదికలను అందజేస్తుందని వెల్లడించారు.
కాగా, బెంగళూరులో ఇద్దరు శిశువులు, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఒక చిన్నారి, పశ్చిమ బెంగాల్లో ఒకరికి హెచ్ఎంపీవీ సోకినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







