కబ్ద్‌లోని రోడ్ నెట్‌వర్క్‌ పనులకు మోక్షం..కౌన్సిల్ ఆమోదం..!!

- January 07, 2025 , by Maagulf
కబ్ద్‌లోని రోడ్ నెట్‌వర్క్‌ పనులకు మోక్షం..కౌన్సిల్ ఆమోదం..!!

కువైట్: కబ్ద్‌లోని రోడ్ నెట్‌వర్క్ అధ్యయనం, రూపకల్పన, అమలు పర్యవేక్షణ, నిర్వహణ కోసం అడ్వైజరీ ఒప్పందాన్ని మున్సిపల్ కౌన్సిల్ ఆమోదించింది. రోడ్లు మరియు రవాణా కోసం పబ్లిక్ అథారిటీ (PART)తో సమన్వయం చేసుకుంటూ మునిసిపల్ రోడ్ నెట్‌వర్క్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కోసం ప్రణాళికలను ఆమోదించింది. ఇది ఉత్తరాన ఆరవ రింగ్ రోడ్ నుండి దక్షిణం,తూర్పున ఏడవ రింగ్ రోడ్ ఎక్స్ టెన్షన్, పశ్చిమాన సాల్మీ రోడ్ వరకు ఉంటుందని తెలిపారు.

ఈ ఒప్పందంలో అనేక అంతర్గత, ప్రధాన రహదారుల నిర్మాణంతోపాటు వాటి అనుబంధ సేవలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఐదవ రింగ్ రోడ్,  ఆరవ రింగ్ రోడ్‌ల విస్తరణ, కార్ల కోసం నాలుగు ఓవర్‌పాస్‌ల నిర్మాణం, 25 నుండి 50 మీటర్లు వరకు వ్యాసార్థంతో 63 రౌండ్‌అబౌట్‌ల ఏర్పాటు కూడా ఉందని వెల్లడించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com