గేమ్ ఛేంజ‌ర్ నుంచి ‘కొండ దేవర’ పాట వ‌చ్చేసింది.. విన్నారా?

- January 08, 2025 , by Maagulf
గేమ్ ఛేంజ‌ర్ నుంచి ‘కొండ దేవర’ పాట వ‌చ్చేసింది.. విన్నారా?

గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న మూవీ గేమ్ ఛేంజ‌ర్‌. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. సంక్రాంతి కానుక‌గా మ‌రో రెండు రోజుల్లో (జ‌న‌వ‌రి 10న‌) ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా కొండ దేవ‌ర పాట‌ను విడుద‌ల చేశారు.

“నెత్తురంతా ఉడుకుతున్న ఊరువాడ జాత‌ర” అంటూ ఈ పాట సాగుతోంది. కాస‌ర్ల శ్యామ్ లిరిక్స్ అందించ‌గా, త‌మ‌న్‌, శ్రావ‌ణ భార్గ‌వి పాడారు. ప్ర‌స్తుతం ఈ పాట యూట్యూబ్‌లో దూసుకుపోతుంది.

ఈ చిత్రంలో కియారా అద్వాని క‌థానాయిక‌. శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్ జే సూర్య‌, అంజ‌లి, శ్రీకాంత్ లు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, పాట‌లు, ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను అమాంతం పెంచేశాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com