విజిట్ వీసా టూ వర్క్ పర్మిట్.. ఎంపీల్లో భిన్నాభిప్రాయాలతో నిలిచిన ఓటింగ్..!!
- January 08, 2025
మనామా: విజిట్ వీసా ను వర్క్ పర్మిట్ గా మార్పు చేసే ముసాయిదా చట్టంపై ఓటింగ్ ను నిలిపివేయాలని బహ్రెయిన్ పార్లమెంటు నిర్ణయించింది. ఈ ప్రతిపాదనపై ఎంపీలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. కొందరు ఇది స్థానికులకు ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తాయని అనగా, మరి కొందరు జాబ్ మార్కెట్ కు లో కాస్ట్ లేబర్ అందుబాటును దెబ్బతీస్తుందని, తద్వారా పారిశ్రామిక వృద్ధితోపాటు కీలక రంగాలు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముసాయిదా చట్టం 1965 ఎలియెన్స్ (ఇమ్మిగ్రేషన్ అండ్ రెసిడెన్స్) చట్టాకి సవరణ చేయడం ద్వారా ఎంట్రీ వీసాలను వర్క్ పర్మిట్ గా మార్చే పద్ధతిని పూర్తిగా నిషేధించనున్నారు. ఇదిలా ఉండగా, విదేశీ వ్యవహారాలు, రక్షణ మరియు జాతీయ భద్రతా కమిటీ చైర్మన్ హసన్ బుఖమాస్ బిల్లుపై మరింత అధ్యయనం చేసేందుకు సమయం కావాలని పార్లమెంటును కోరడంతో ఆమోదించారు. చౌకైన విదేశీ లేబర్ ను అడ్డుకోవాలని, ఇది బహ్రెయినీలకు ఉద్యోగ అవకాశాలను తగ్గించిందని ఎంపి జలాల్ కధేమ్ అన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్ సక్సెస్..!!
- యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లో రియాద్, మదీనా..!!
- ఒమన్-రష్యా దౌత్య సంబంధాలకు 40 ఏళ్లు..!!
- కువైట్ లో నవంబర్ 8న రెయిన్ ప్రార్థనలు..!!
- F1 ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ 2025..లుసైల్ సర్క్యూట్ కు కౌంట్ డౌన్..!!
- సాలిక్ నవంబర్ 2న పీక్ అవర్ టోల్ రేట్స్ అప్డేట్..!!
- హాస్పిటల్లో దిగ్గజ నటుడు ధర్మేంద్ర
- నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ. 10 వేల పరిహారం: సీఎం రేవంత్
- ఆసియా కప్ ట్రోఫీపై BCCI ఆగ్రహం!
- శ్రీవారి సేవ పై టీటీడీ ఈఓ సమీక్ష







