విమానం ల్యాండింగ్ గేర్ లో రెండు మృతదేహాలు
- January 09, 2025
ఫ్లోరిడాలోని విమానాశ్రయంలో వెలుగు చూసిన దారుణం విమాన ల్యాండింగ్ గేర్ వద్ద తనిఖీల్లో వెలుగు చూసిన మృతదేహాలు ధ్రువీకరించిన జెట్‌బ్లూ విమాన సంస్థ అమెరికాలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. విమానం ల్యాండింగ్ గేర్ ప్రాంతంలో రెండు గుర్తు తెలియని వ్యక్తుల మృతదేహాలు కనిపించడం తీవ్ర సంచలనమైంది. ఫ్లోరిడాలోని ఓ విమానాశ్రయంలో జెట్‌బ్లూకు చెందిన విమానాన్ని తనిఖీ చేస్తుండగా, మృతదేహాలను గుర్తించారు.
మృతుల వివరాలతో పాటు ఈ ఘటన ఎలా జరిగింది? అనేది తెలియాల్సి ఉంది. జెట్‌బ్లూకు చెందిన విమానం న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయిం నుంచి ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్‌డేల్ విమానాశ్రయానికి వచ్చింది.ఈ క్రమంలో ల్యాండింగ్ గేర్ ప్రాంతంలో తనిఖీలు చేస్తుండగా, రెండు మృతదేహాలను గుర్తించారు.ఈ విషయాన్ని జెట్‌బ్లూ సంస్థ ధ్రువీకరించింది.
ఇదిలా ఉంటే, అమెరికాలో గడచిన నెల రోజుల్లో ఈ తరహా ఘటన జరగడం ఇదే రెండోసారి. డిసెంబర్‌లో షికాగో నుంచి మౌయీ విమానాశ్రయానికి వచ్చిన ఓ యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం ల్యాండింగ్ గేర్‌లో కూడా ఓ మృతదేహం లభ్యమైంది.
తాజా వార్తలు
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్‌లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!
- భారతీయ ప్రవాసి వాదనను ఖండించిన సౌదీ పోలీసులు..!!
- కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఒమన్‌లో ఘన స్వాగతం..!!
- ఖతార్ లో జాబ్ సాటిస్పెక్షన్ సర్వే 2025 ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో బంగారు ఆభరణాల దొంగతనం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- మహబౌలాలో భద్రతా క్యాంపెయిన్..263 మంది అరెస్టు..!!
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!







