సౌదీ అరేబియాలో 80.6 శాతానికి చేరిన స్థానిక కూరగాయల ఉత్పత్తి..!!
- January 09, 2025
రియాద్: సౌదీ అరేబియాలో మొత్తం కూరగాయల సరఫరాలో స్థానిక కూరగాయల ఉత్పత్తి 80.6 శాతానికి చేరుకుంది. ఈ మేరకు జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ (GASTAT) జారీ చేసిన వ్యవసాయం, మత్స్య ఖాతాల ప్రచురణ 2023 వెల్లడించింది. స్థానిక ఉత్పత్తులలో మొత్తం పండ్ల సరఫరాలో 63.7 శాతానికి చేరుకోగా, తృణధాన్యాల సరఫరాలో 14.8 శాతం స్థానికంగా కవర్ అవుతుందని వెల్లడించింది.
2023లో రాజ్యంలో స్థానిక పంట ఉత్పత్తి మొత్తం విలువ SR38.332 బిలియన్లకు చేరుకుందని నివేదిక తెలిపింది. చేపల మొత్తం సరఫరా 377,000 టన్నులు కాగా, స్థానిక ఉత్పత్తి 56.9 శాతంగా ఉంది. చేపల దిగుమతులు 43.1 శాతంగా ఉన్నాయి. చేపల ఉత్పత్తి మొత్తం విలువ SR5.189 బిలియన్లకు చేరుకుంది. ఇక మొత్తం సరఫరాలో స్థానిక పశువుల ఉత్పత్తి 67.4 శాతానికి, ఒంటె ఉత్పత్తి 76 శాతంగా ఉంది. స్థానిక గొర్రెలు, మేకల ఉత్పత్తి సగటు విలువ హెడ్ కు SR1,250 వద్ద ఉందని అగ్రికల్చర్ అండ్ ఫిషరీస్ అకౌంట్స్ పబ్లికేషన్ తన డేటాలో వెల్లడించింది.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







