ఒమన్ తీరం వైపు కదులుతున్న సైక్లోన్
- June 29, 2016
02 ఎ అనే కోడ్ నేమ్‌తో వ్యవహరిస్తున్న సైక్లోన్ ఒకటి ఒమన్ తీరం వైపుగా దూసుకొచ్చేలా ఉందని అంచనా వేస్తున్నారు. అరేబియా సముద్రంలో ఈ సైక్లోన్ రూపొందింది. అల్ప పీడనంగా ప్రారంభమై 24 గంటల్లో బలపడి, క్రమక్రమంగా ఇంకా బలం పుంజుకుని సైక్లోన్‌గా మారవచ్చని వాతావరణ శాఖ నిపుణులు ఓ అంచనాకి వచ్చారు. సైక్లోన్‌గా బలపడేందుకు అవకాశాలు ఉన్నట్లే, అది బలహీనపడేందుకు కూడా అవకాశం ఉంది. ఈ ప్రభావంతో సౌత్ షర్కియా, వుస్తా, దోఫార్ గవర్నరేట్స్ పరిధిలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మసిరా ఐలాండ్‌లో ఓ మోస్తరు వర్షం ఇప్పటికే ప్రారంభమైంది. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం 50 నాట్స్ కన్నా వేగంతో తుపాను కారణంగా గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలియవస్తోంది. వేసవిలో తుపాన్లు రావడం సహజమే. అరేబియా సముద్రం నుంచి ఈ తుపాన్లు ముంచుకొస్తుంటాయి. జూన్ నుంచి నవంబర్ వరకు ఈ ప్రాంతంలో తుపాన్లు తరచుగా వస్తుంటాయి. సైక్లోన్ గోను 2009లో ఈ రీజియన్‌పై తీవ్ర ప్రభావం చూపింది. 2015 నవంబర్‌లో ఎమెని అథారిటీస్, సొకోట్రా ఐలాండ్‌ని దాదాపుగా ఖాళీ చేయించారు తుపాను కారణంతో
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







