2016 జనవరి 1 నుంచి కేంద్రం వేతన సవరణ పెంపుదల వర్తించ నుంది

- June 29, 2016 , by Maagulf
2016 జనవరి 1 నుంచి కేంద్రం వేతన సవరణ పెంపుదల వర్తించ నుంది

ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్రమంత్రి వర్గం బుధవారం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏడో వేతన సవరణ సంఘం సిఫార్సులకు కేంద్రమంత్రి వర్గం ఆమోద ముద్రవేసింది. కేంద్రం నిర్ణయంతో కోటిమందికి పైగా ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన వారికి ప్రయోజనం కలగనుంది. మూలవేతనంపై 16శాతం పెంచాలని ఏడో వేతన సవరణ సంఘం సిఫార్సు చేసింది. 2016 జనవరి 1 నుంచి వేతన సవరణ పెంపుదల వర్తించ నుంది. జాతీయ గనుల తవ్వకం విధానానికి కూడా మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఆర్మీ సిబ్బంది భత్యాన్ని రూ.21 వేల నుంచి 31,500కు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com