పండగవేళ ఆర్టీసీ బస్సుల దోపిడి
- January 11, 2025
పండగ పూట ఇంటికెళ్లేందుకు నగర ప్రజలంతా పల్లెబాట పడుతుండగా.. ఇదే అదునుగా చేసుకుని తెలంగాణలో ఆర్టీసీ యాజమాన్యం మోత మోగిస్తోందని ప్రయాణికులు లబోదిబోమంటున్నారు. నేటి నుంచి స్కూళ్లకు సెలవులు ప్రకటించటంతో.. ఒక రోజు ముందు జనవరి 10 నుంచే బస్సులు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ మొదలైంది. ఈ నేపథ్యంలో.. టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం గురువారం నుంచే సంక్రాంతి స్పెషల్ బస్సులను నడిసపిస్తోంది. అయితే.. సంక్రాంతి స్పెషల్ బస్సుల పేరుతో.. అడ్డగోలుగా టికెట్ రేట్లను పెంచేసి.. ప్రయాణికులను నిలువునా దోచేస్తున్నట్టుగా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.
ఈ మేరకు సోషల్ మీడియాల్లో బస్సు టికెట్లను ప్రయాణికులు షేర్ చేస్తే.. సంక్రాంతి పండగ పూట ఆర్టీసీ బాదుడు అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో.. సంక్రాంతికి స్పెషల్ బస్సుల పేరుతో ఆర్టీసీ దోపిడీ చేస్తోందంటూ వనపర్తికి చెందిన ఓ నెటిజన్ పోస్ట్ పెట్టాడు.
ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచితమే కానీ.. పురుషుల దగ్గర మాత్రం కండక్టర్లు ఎక్స్‌ట్రా ఛార్జీలు వసూలు చేస్తూ జేబులు గుల్ల చేస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు. వనపర్తి నుంచి మహబూబ్ నగర్‌కు సాధారణంగా ఛార్జీ రూ.100 ఉంటే.. ఇప్పుడు రూ.140 వసూలు చేస్తున్నారని.. అందుకు సాక్ష్యంగా తన టికెట్‌ను ఫొటో తీసి మరీ పోస్ట్ చేశాడు. మహిళల ఛార్జీలు కూడా పురుషుల దగ్గర వసూలు చేస్తున్నారంటూ మండిపడుతూ ట్వీట్ చేశాడు.
మరోవైపు.. ఈ దారిదోపిడి సాధారణ ప్రయాణికుల దగ్గరే కాదు.. దివ్యాంగుల దగ్గర కూడా చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ప్రజా పాలనలో పండుగ పేరుతో ఆర్టీసీ టికెట్ రేట్లు అంతకంత పెంచి దోపిడీ చేస్తున్నారని దుయ్యబడుతున్నారు. సాధారణ రోజుల్లో వికలాంగులకు హాఫ్ టికెట్ ఉంటే.. పండుగ పేరుతో వారికి కూడా ఫుల్ టికెట్ తీసుకుంటూ దోపిడీ చేస్తున్నారంటూ తెలంగాణ ఆర్టీసీ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో భారీ డిస్కౌంట్లు.. 10 లక్షలకు పైగా ఉత్పత్తులపై ధరల తగ్గింపు..!!
- ధోఫర్ ఖరీఫ్ సీజన్‌కు పోటెత్తిన పర్యాటకులు..!!
- తూర్పు రిఫాలో భవనాన్ని కూల్చివేసిన అధికారులు..!!
- హోర్ముజ్ జలసంధిలో ADNOCకు చెందిన రెండు నౌకలపై దాడి
- భారత్ కో జానియే క్విజ్‌కు ముగియనున్న గడువు..!!
- సౌదీలో ఐబెక్స్‌ను వేటాడిన వ్యక్తి అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో రెండు రోజుల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్..!!
- సలాలాలో ఒమన్ ట్రెడిషనల్ గేమ్స్ సీజన్ 2026 ప్రారంభం..!!
- భోగాపురం నుంచి తొలిరోజు 31 విమాన సర్వీసులు
- కొలంబియా భూకంప బాధితులకు యూఏఈ భారీ సాయం..!!







