4WD పల్టీలు కొట్టింది.. మినీ వ్యాన్ క్రాష్.. పోలీసుల హెచ్చరిక..!!
- January 11, 2025
యూఏఈ: నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే వారికి అబుదాబి పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు పలు ప్రమాదాలకు సంబంధించిన షాకింగ్ వీడియోలను షేర్ చేసింది. ఇందులో పరధ్యానంగా డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే ప్రమాదాలను హైలైట్ చేశారు. అనేక క్లిప్లు పరధ్యానంగా డ్రైవింగ్ చేయడం వల్ల సంభవించే పెద్ద ట్రాఫిక్ ప్రమాదాలను చూపాయి.
మొదటి వీడియోలో.. ఒక సెలూన్ కారు.. రోడ్డుపై స్లోగా వెళుతున్న 4-వీల్ వెహికల్ ను ఢీకొట్టింది. దాంతో ట్రాఫిక్ స్తంభించింది. దీని వలన పలు కార్లు ఢీకొట్టుకున్నాయి. 4-వీల్ వాహనం పల్టీలు కొట్టింది. మరొక సందర్భంలో.. ఒక కారు మినీవ్యాన్ను ఢీకొట్టింది. అది రోడ్డు పక్కన ఉన్న డివైడర్ ను ఢీకొట్టింది. మరొక సంఘటనలో 4-వీల్ వెహికల్ అదుపు తప్పి దూసుకెళ్లింది. పరధ్యానంతో డ్రైవింగ్ చేయడం వాహనదారుల జీవితాలకు ఎలా ప్రమాదం కలిగిస్తుందో వివరించడానికి ఒక పోలీసు అధికారి స్క్రీన్పై హెచ్చరికలు జారీ చేశాడు." డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తంగా ఉండాలని, సెల్ ఫోన్ డ్రైవింగ్ ను నివారించాలని వాహనదారులను కోరారు.
తాజా వార్తలు
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన
- దుబాయ్లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ
- మస్కట్ నైట్స్ 2026 జనవరిలో ప్రారంభం..!!
- కువైట్ లో వీసా కోసం..ఆరోగ్య బీమా రుసుములు పెంపు..!!
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!







