బహ్రెయిన్ లో విదేశీ మాస్టర్స్ డిగ్రీ హోల్డర్లకే ప్రభుత్వ ఉద్యోగాలు..!!
- January 11, 2025మనామా: ప్రభుత్వ రంగంలో మాస్టర్స్ డిగ్రీ ఉన్న విదేశీయులను మాత్రమే ఉద్యోగాల్లోకి తీసుకోవాలన్న వివాదాస్పద బిల్లు చర్చకు వచ్చింది. ప్రధాన కమిటీలు, సివిల్ సర్వీస్ బ్యూరో (CSB) ఆందోళనలను పెంచడంతో, ప్రతినిధుల సభలో బిల్లుపై వ్యతిరేకత పెరుగుతోంది. ఈ బిల్లు ప్రభుత్వ రంగ ఉద్యోగాలను కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉన్న విదేశీయులకు పరిమితం చేస్తుంది. దాంతోపాటు కాంట్రాక్టులు రెండు సంవత్సరాలకు పరిమితం అవుతాయి. ఒకసారి మాత్రతే పునరుద్ధరణకు అనుమతిస్తారు.
విదేశీ పౌరుల నియామక నిబంధనలను కఠినతరం చేసే లక్ష్యంతో రూపొందించిన ఈ బిల్లు నైపుణ్యం కొరతను సృష్టించవచ్చని, కీలక రంగాలకు అంతరాయం కలిగించవచ్చని, రిక్రూట్‌మెంట్ ప్రక్రియలను దెబ్బతీస్తుందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. CSB, షురా కౌన్సిల్ లెజిస్లేటివ్, లీగల్ అఫైర్స్ కమిటీ ఈ ప్రతిపాదన అసాధ్యమని, రాజ్యంలో 90% పైగా విదేశీ కార్మికులు పనిచేస్తున్న ఆరోగ్య సంరక్షణ, విద్య వంటి కీలక రంగాలకు హాని కలిగించవచ్చని వాదిస్తున్నారు.
ప్రభుత్వ రంగంలో విదేశీ కార్మికులు ఇప్పటికే తగ్గుముఖం పట్టారు. CSB డేటా గత ఐదేళ్లలో 23% తగ్గుదలని చూపుతోంది. 2019లో 7,582 నుండి 2024లో 5,800కి పడిపోయింది. బహ్రెయిన్‌లు ఇప్పుడు ప్రభుత్వ రంగ శ్రామికశక్తిలో 86% ఉన్నారు. విదేశీ పౌరులు 14% మాత్రమే ఉన్నారు. ఇలాంటి కఠిన నిబంధనలు విధించడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుందని బ్యూరో హెచ్చరించింది. హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్ రంగాలు ఎక్కువగా దెబ్బతింటాయని CSB నొక్కి చెప్పింది. ఈ ప్రతిపాదన గణనీయమైన నైపుణ్యాల కొరతకు, కార్యకలాపాలకు విఘాతం కలిగించడానికి, అవసరమైన సేవలను ప్రభావితం చేయడానికి దారితీయవచ్చని ఆందోళనలు పెరుగుతున్నాయి.
తాజా వార్తలు
- ప్రముఖ గాయకుడు వై.ఎస్.రామకృష్ణకు ఎన్టీఆర్ వంశీ గ్లోబల్ అవార్డు
- నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైసీపీ
- మహా కుంభమేళాలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం
- మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- సింగపూర్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్
- గన్నవరం ఎయిర్ పోర్ట్ కు అమిత్ షా
- డేటా సెంటర్లకు రాజధానిగా హైదరాబాద్..
- దుబాయ్ హిందూ మందిరానికి అరుదైన గౌరవం
- ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో యూఏఈ కీలకం..!!
- సౌదీలో 2.9 మిలియన్లకు పైగా క్యాప్గాన్ పిల్స్ సీజ్..!!