సౌదీ బార్డర్లో స్పెషల్ ఆపరేషన్..6 కిలోల 'మెత్' సీజ్..!!
- January 11, 2025రియాద్: అల్-బాథా సరిహద్దు క్రాసింగ్‌ల ద్వారా సాధారణంగా "షాబు" అని పిలువబడే మెథాంఫేటమిన్ అక్రమ రవాణా చేయడానికి చేసిన రెండు ప్రయత్నాలను జకాత్, టాక్స్ మరియు కస్టమ్స్ అథారిటీ (ZATCA) విఫలం చేసింది.
మొదటి సందర్భంలో.. అల్-బాతా సరిహద్దు క్రాసింగ్ వద్ద కస్టమ్స్ అధికారులు ఒక ట్రక్కును తనిఖీ చేశారు. ట్రక్కు పక్క కంపార్ట్‌మెంట్లలో దాచిన 1.944 కిలోగ్రాముల షాబును కనుగొన్నారు. అక్రమ పదార్థాలను గుర్తించడంలో అధునాతన భద్రతా సాంకేతికత కీలక పాత్ర పోషించింది.
రెండవ సంఘటనలో.. ఎంఫ్టీ క్వార్టర్ క్రాసింగ్ వద్ద ZATCA అధికారులు 4.140 కిలోగ్రాముల షాబును తీసుకువెళుతున్న వాహనాన్ని అడ్డుకున్నారు. వాహనం బ్యాటరీ కంపార్ట్‌మెంట్‌లో ఉన్న భాగాలలో దీనిని దాచి తరలిస్తున్నారు. వారిచ్చిన సమాచారంతో సౌదీ అరేబియాలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. కచ్చితమైన సమాచారం ఇచ్చిన వారికి నగదు అవార్డులను అందజేస్తామని జాక్టా అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రముఖ గాయకుడు వై.ఎస్.రామకృష్ణకు ఎన్టీఆర్ వంశీ గ్లోబల్ అవార్డు
- నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైసీపీ
- మహా కుంభమేళాలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం
- మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- సింగపూర్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్
- గన్నవరం ఎయిర్ పోర్ట్ కు అమిత్ షా
- డేటా సెంటర్లకు రాజధానిగా హైదరాబాద్..
- దుబాయ్ హిందూ మందిరానికి అరుదైన గౌరవం
- ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో యూఏఈ కీలకం..!!
- సౌదీలో 2.9 మిలియన్లకు పైగా క్యాప్గాన్ పిల్స్ సీజ్..!!