భారత్ లో పెరుగుతున్న హెచ్ఎంపీవీ కేసులు.. కేంద్ర ఆరోగ్య శాఖ కీలక సూచనలు
- January 11, 2025దేశంలో హ్యూమన్ మెటాప్‌న్యూమో వైరస్ (HMPV) కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా అస్సాంలోకూడా హెచ్ఎంపీవీ కేసు నమోదైంది. రాష్ట్రంలోని లఖింపూర్ లో పది నెలల చిన్నారికి ఈ వైరస్ సోకింది. దీంతో ఆ చిన్నారిని అస్సాం మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ లో చేర్పించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అయితే, తాజాగా అస్సాంలో నమోదైన కేసుతో దేశంలో మొత్తం 15 హచ్ఎంపీవీ కేసులు నమోదయ్యాయి. గుజరాత్ లో అత్యధికంగా నాలుగు కేసులు నమోదుకాగా.. మహారాష్ట్రంలో మూడు, కర్ణాటక రాష్ట్రంలో రెండు, తమిళనాడులో రెండు, కోల్‌కతాలో మూడు, అస్సాంలో ఒక కేసు నమోదైంది.
చైనాలో హెచ్ఎంపీవీ విజృంభిస్తూనే ఉంది. ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ వైరస్ భారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. అయితే, చైనాకు ఆనుకొని ఉన్న భారత్ దేశంలోని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. సిక్కిం చైనాకు దాదాపు 200 కిలో మీటర్ల పొడవైన సరిహద్దును కలిగి ఉంది. ఇది ఉత్తర, ఈశాన్యంలో టిబెట్ అటానమస్ రీజియన్ తో చుట్టుమట్టబడింది. దీంతో కేంద్ర ఆరోగ్యశాఖ సూచనలతో సిక్కీం ప్రభుత్వం అప్రమత్తమైంది. అయితే, దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ వల్ల ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. నిరంతరం దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, ముక్కు కారడం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది తలెత్తడం వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
హెచ్ఎంపీవీ వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆందోళన చెందాల్సిన పనిలేదని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. వైరస్ కొత్తది కాదని.. ఇంతకు ముందు కూడా అనేక కేసులు నమోదయ్యాయని తెలిపారు. హెచ్ఎంపీవీ ఇన్ ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ప్రజలకు సూచించిన విషయం తెలిసిందే.
హెచ్ఎంపీవీ వైరస్ సోకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. రద్దీ ప్రదేశాల్లో మాస్క్ ధరించాలి. బయట ప్రదేశాల్లోకి వెళ్లి ఇంటికి తిరిగివచ్చిన తరువాత తప్పనిసరిగా చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. చేతులు శుభ్రం చేసుకోకుండా కళ్లు, ముక్కు, నోటిని తాకడం చేయొద్దు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. బలమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉండాలి.
తాజా వార్తలు
- ప్రముఖ గాయకుడు వై.ఎస్.రామకృష్ణకు ఎన్టీఆర్ వంశీ గ్లోబల్ అవార్డు
- నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైసీపీ
- మహా కుంభమేళాలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం
- మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- సింగపూర్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్
- గన్నవరం ఎయిర్ పోర్ట్ కు అమిత్ షా
- డేటా సెంటర్లకు రాజధానిగా హైదరాబాద్..
- దుబాయ్ హిందూ మందిరానికి అరుదైన గౌరవం
- ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో యూఏఈ కీలకం..!!
- సౌదీలో 2.9 మిలియన్లకు పైగా క్యాప్గాన్ పిల్స్ సీజ్..!!