కోల్డ్‌ప్లే కాన్సర్టుకు వెళ్తున్నారా? లాంగ్ క్యూ, స్నాగ్‌ల నివారణకు వెళ్లినవారి టిప్స్..!!
- January 12, 2025
యూఏఈ: నాలుగు కోల్డ్‌ప్లే కాన్సార్టులలో మొదటిది ముగిసింది. యూఏఈతోపాటు విదేశాల నుండి వేలాది మంది అభిమానులు గురువారం అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో తమ అభిమాన బ్యాండ్ కాన్సర్టును ఆస్వాదిస్తూ చిరస్మరణీయమైన రాత్రిని గడిపారు. అయితే, ఇతర ప్రధాన ఈవెంట్‌ల మాదిరిగానే కొంతమంది అభిమానులు ఇక్కడకొన్ని సమస్యలను ఎదుర్కొన్నారు. షటిల్ బస్సుల్లో ఉచిత రైడ్‌లను పొందడానికి ఒక గంట కంటే ఎక్కువ సమయం వెచ్చించడం నుండి కాన్సర్ట్ వేదికకు వెళ్లే వరకు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు పలువురు అభిమానులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జనవరి 12, 14 తేదీల్లో షోలకు వెళ్లే వారికి కొన్ని చిట్కాలు ఇచ్చారు.
ముందుగానే చేరుకోండి
కాన్సర్టుకు ముందుగానే చేరుకోవాలని, కనీసం ఒకటి నుండి రెండు గంటల వరకు బఫర్ సమయాన్ని వదిలేయాలని సూచించారు. ఇది కాన్సర్ట్ కాబట్టి, సౌకర్యవంతమైన బూట్లు ధరించాలన్నారు. ట్రాఫిక్‌ను అధిగమించడానికి చాలా దూరం నడవడానికి సిద్ధంగా ఉండాలని, వేదిక లోపల నీటిని నింపడానికి మెటల్ బాటిళ్లను తీసుకెళ్లాలని తెలిపారు. వేదికకు చేరుకోవడానికి మీ కారును వదిలి, ఇతర రవాణా మార్గాలపై పార్క్-అండ్-రైడ్ ఉపయోగించాలి. టాక్సీలను ఉపయోగిస్తుంటే, సాధారణ రేట్లను "డబుల్" లేదా "ట్రిపుల్" చెల్లించడానికి సిద్ధంగా ఉండాలన్నారు.
సిరియన్-కెనడియన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయిన అబేద్ హలావానీ స్టేడియానికి చేరుకోవడానికి సాధారణ ఛార్జీల కంటే మూడు రెట్లు చెల్లించినట్ల తెలిపాడు. అతను నేషన్ టవర్స్ వెలుపల ఉన్న పిక్-అప్ పాయింట్‌కి వెళ్లాలని ఎంచుకున్నాడు. అయితే, సాయంత్రం 5 గంటలకు షటిల్ బస్సుల కోసం భారీ క్యూని చూసిన అతను బదులుగా కరీమ్ టాక్సీని బుక్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అక్కడికి చేరుకోవడానికి క్యాబ్‌కి 15 నిమిషాలు పట్టింది. స్టేడియం చేరుకోవడానికి దాదాపు 50 నిమిషాలు పట్టింది. అతనడితోపాటు అతని స్నేహితులను ప్రవేశ ద్వారం నుండి 15 నిమిషాల దూరంలో రద్దీగా ఉండే వీధిలో దించివేశారు. రాత్రి 10 గంటలకు కచేరీ ముగిసిన తర్వాత నాలుగు ఎగ్జిట్ ల నుండి ప్రజలు బయటకు రావడంతో ట్రాఫిక్ స్తంభించింది. అర్ధరాత్రికి రోడ్లు చాలా రద్దీగా ఉన్నాయని, దాంతో తమ బృందం 15 నిమిషాల పాటు నడిచిందని పేర్కొన్నాడు.
“సాస్ అల్ నఖల్‌లోని మా పార్కింగ్ ప్రాంతానికి మమ్మల్ని తిరిగి తీసుకెళ్లడానికి షటిల్ బస్సు ఎక్కేందుకు మాకు ఒక గంట కంటే ఎక్కువ సమయం పట్టింది. మేము బస్సు ఎక్కిన తర్వాత, అది (ప్రయాణం) సజావుగా సాగింది. ”అని ఢిల్లీ నుండి దుబాయ్‌కి వెళ్లిన మరొక అభిమాని రియా రహిమాన్ అన్నారు. “షటిల్ బస్సులకు మాకు మార్గనిర్దేశం చేసే సంకేతాలు లేవు. మేము తప్పిపోయాము. క్యూలు చాలా పొడవుగా ఉన్నాయి. ”అని పాలస్తీనా ప్రవాసుడు, దుబాయ్ నివాసి జైన్ మ్రయ్య చెప్పారు.
నవంబర్ 2024లో సిడ్నీలో జరిగిన కోల్డ్‌ప్లే కాన్సర్టుకు కూడా హాజరైన రియా, మెటల్ వాటర్ బాటిల్‌ని తీసుకెళ్లమని సూచిస్తుంది. “నేను ఒక ప్లాస్టిక్ బాటిల్ కొన్నాను. కానీ సెక్యూరిటీ నన్ను దానిని వేదికలోకి తీసుకెళ్లనివ్వలేదు. నా స్నేహితుడు ఒక మెటల్ బాటిల్ తీసుకెళ్లాడని తెలిపింది. ఆమె గురువారం మధ్యాహ్నం 1 గంటలకు దుబాయ్ నుండి బయలుదేరింది. కాన్సర్టుకు వెళ్లేవారు త్వరగా వేదిక వద్దకు చేరుకోవడం చాలా ముఖ్యమని అన్నారు. "మేము షహామా పార్క్-అండ్-రైడ్ వద్దకు ముందుగానే చేరుకున్నాము. వెంటనే షటిల్ బస్సును పొందాము." ఆమె చెప్పింది. “స్టేడియం ముందు వాహనాలు కదలకపోవడంతో ట్రాఫిక్‌లో చిక్కుకున్నాం. మేము స్టేడియం నుండి 10-15 నిమిషాల దూరంలో బయటకు వచ్చి మైలు దూరం నడిచాము. కాబట్టి, త్వరగా చేరుకోవడం, సౌకర్యవంతమైన బూట్లు ధరించడం చాలా ముఖ్యం.’’ అని తమ అనుభవాన్ని తెలిపారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







