బహ్రెయిన్ జాతీయ క్రీడా దినోత్సవం 2025..ప్రణాళిక ఆవిష్కరణ..!!
- January 13, 2025
మనామా: బహ్రెయిన్ స్పోర్ట్స్ డే 2025కి వేదిక సిద్ధమైంది. బహ్రెయిన్ నేషనల్ స్టేడియంలో జరిగిన సమావేశంలో జాతీయ క్రీడా దినోత్సవం ప్రణాళికను ఆవిష్కరించారు. జనరల్ స్పోర్ట్స్ అథారిటీ మరియు బహ్రెయిన్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ప్రతినిధులతో కలిసి ఫిబ్రవరిలో జరిగే ఈ వార్షిక ఈవెంట్ ప్రాముఖ్యతను డా. అబ్దుల్రహ్మాన్ అస్కర్ హైలైట్ చేశారు. "బహ్రెయిన్ క్రీడా దినోత్సవం కేవలం క్రీడాకారులకు మాత్రమే కాదు, ఆరోగ్యవంతమైన జీవితం వైపు అడుగులు వేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరికీ" అని తెలిపారు. పిల్లలు, యువకులు, వృద్ధుల కోసం రూపొందించబడిన కార్యకలాపాలతో ఈవెంట్ థీమ్ రూపొందించినట్లు పేర్కొన్నారు.సమా బే ప్రధాన వేదికగా వేడుకలు జరుగుతాయని తెలిపారు. జనవరి 31న బహ్రెయిన్ నేషనల్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఛారిటీ మ్యాచ్ "యూనిటీ కిక్-ఆఫ్" ఉత్సాహాన్ని అందిస్తుందని వెల్లడించారు. ఈ స్నేహపూర్వక గేమ్ లో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో పాటు జాన్ టెర్రీ, రాబర్టో కార్లోస్, డిమిటార్ బెర్బటోవ్ వంటి ఫుట్బాల్ లెజెండ్లు పాల్గొంటున్నారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన రెయిన్స్..!!
- అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్ ను మూసేసిన దుబాయ్..!!
- మిడిలీస్టు అంతరిక్ష సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ఉచిత వై-ఫై..!!
- మెట్రోలింక్ అప్డేట్ ప్రకటించిన దోహా మెట్రో..!!
- కువైట్ లో ఇల్లిగల్ అల్కాహాల్ ఫ్యాక్టరీ ధ్వంసం..!!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స







