అల్ వక్రా సూక్ లో అంతర్జాతీయ సర్కస్.. జనవరి 17 వరకు పొడిగింపు..!!

- January 15, 2025 , by Maagulf
అల్ వక్రా సూక్ లో అంతర్జాతీయ సర్కస్.. జనవరి 17 వరకు పొడిగింపు..!!

దోహా, ఖతార్: అల్ వక్రా సూక్ లోని “బియాండ్ రియాలిటీ” ఇంటర్నేషనల్ సర్కస్ పెద్ద సంఖ్యలో జనాలను ఆకర్షిస్తూనే ఉంది. దాని అసాధారణమైన ప్రదర్శనలు, కుటుంబ-స్నేహపూర్వక వాతావరణంతో అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రేక్షకుల డిమాండ్ కారణంగా ప్రదర్శనను జనవరి 17 వరకు పొడిగించారు. ఈ సర్కస్ లో రష్యా, బెలారస్ లకు చెందిన కళాకారులు పాల్గొంటున్నారు. షో క్రియేటర్ మరియు LANA గ్రూప్ ఇంటర్నేషనల్ WLL ఖతార్ జనరల్ మేనేజర్ స్వెత్లానా లెవిట్స్‌కాయా మాట్లాడుతూ.. ఖతారీ ప్రేక్షకుల అధిక ఆదరణకు ధన్యవాదాలు తెలిపారు. సర్కస్ ప్రతిరోజూ సాయంత్రం 5, 7:30 గంటలకు ఉంటుంది. టిక్కెట్ల ధర QR50, QR300 మధ్య ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com