మల్టీ స్టారర్ సినిమాలు ..
- June 29, 2016
రెండు దేశాలు...ఇద్దరు సూపర్ స్టార్లు...ఈ ఇద్దరితో సినిమా తీస్తే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన వచ్చింది ఓ ప్రొడ్యూసర్ కు. నిజంగానే ఇది సూపర్ ఐడియా. ఇప్పటివరకు తీసిన మల్టీ స్టారర్ సినిమాలు చాలావరకు ఒక లాంగ్వేజ్ హీరోలతోనో లేదా రెండు భాషల హీరోలతోనో తీసినవే. కానీ...రెండు దేశాల హీరోలతో తీస్తే... ఆ సినిమాను ఏమంటారు? ఇంటర్నేషనల్ మల్టీ స్టారర్ అనవచ్చు. ఇలాంటి ఓ వెరీ బిగ్ మూవీ ప్రాజెక్ట్ ప్లానింగ్ లో ఉందట.మలేసిసియా ప్రొడ్యూసర్ మహమూద్ రఫీజీ మహమూద్ జిన్ ఓ భారీ ఇంటర్నేషనల్ మూవీ ప్రాజెక్ట్ కు ప్లాన్ వేశాడు. ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, ఇంటర్నేషనల్ సూపర్ స్టార్ జాకీచాన్ తో ఒక అదిరిపోయే మూవీని చేయాలనుకుంటున్నాడు. ఇప్పటికే ఆ నిర్మాత రజనీకాంత్, జాకీచాన్ లను సంప్రదించాడట. అయితే ఆ మూవీకి 'చినీ పాగ'... అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఇద్దరు మూవీ లెజెండ్స్ నటించే ఈ మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ సోనమ్ కపూర్ ను అడిగారట ఆ ప్రొడ్యూసర్. మలేసియా నటీనటులు కొందరు కీలక పాత్రల్లో నటిస్తారట. మలేసియాలోని చిని అనే సరస్సు లో ఉండే డ్రాగన్ పైనే ఈ సినిమా స్టోరీ నడుస్తుందట. ఇండియా, నార్వే, థాయిలాండ్, ఇండోనేసియా, చైనాల్లో ఈ సినిమా షూటింగ్ కు ప్లాన్ చేస్తున్నారట. నాలుగేళ్ల కిందటే ఈ సినిమా చేయాలనుకున్నానని మహమూద్ జిన్ చెప్పాడు. ఈ మూవీలో చాలా పార్ట్ గ్రాఫిక్స్ తో ఉంటుందట.
తాజా వార్తలు
- ‘అరబ్ హోప్ మేకర్స్’ ఏడో ఎడిషన్ ప్రారంభం.. విజేతకు రూ. కోట్లు విలువైన బహుమతి..!
- మస్కట్‌లో అక్టోబర్ 28 నుంచి ఆర్ట్ ఎగ్జిబిషన్–2026..!!
- డిసెంబర్ 11 నుంచి అబుదాబిలో ‘లివా ఫెస్టివల్’..!
- విద్యార్థుల ఆరోగ్య వివరాలు ఇవ్వండి..పేరెంట్స్ కు PHCC సూచన..!!
- కువైట్‌లో వాహన బీమా విధానంలో కీలక మార్పులు..!
- బహ్రెయిన్‌లో కిడ్నాప్ కేసు.. ఇద్దరు కంపెనీ అధికారులకు మూడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీ అరేబియాపై హౌతీల దాడి.. ఆరుగురికి గాయాలు..!!
- హౌతీలను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి: జీసీసీ దేశాల డిమాండ్
- బహ్రెయిన్‌లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..!!
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..







