దుబాయ్ పార్కింగ్ కేంద్రాల్లో కార్ వాషింగ్, రిఫ్యూయలింగ్..!!
- January 16, 2025
దుబాయ్: పార్కింగ్ కేంద్రాలలో ఇంధనం నింపడం, కార్ వాషింగ్ వంటి సేవలను అందుబాటులోకి రానున్నాయి. ఈమేరకు ఎనోక్ రిటైల్ మేనేజింగ్ డైరెక్టర్ జైద్ అల్క్వైది, పార్కిన్ సీఈఓ మొహమ్మద్ అబ్దుల్లా అల్ అలీ 10వ దుబాయ్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఫోరం సందర్భంగా భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేశారు. దీని ప్రకారం.. దుబాయ్‌లోని ఎంపిక చేసిన పార్కింగ్ ప్రదేశాలు త్వరలో కార్ వాషింగ్, మొబైల్ లేదా ప్రయాణంలో ఇంధనం నింపడం, ఇంజిన్ ఆయిల్ మార్పు, టైర్ తనిఖీలు, బ్యాటరీ తనిఖీలు, ఇతర ముఖ్యమైన వాహన నిర్వహణ సేవలతో సహా ఆటోమోటివ్ సేవలను అందిస్తాయి. పార్కిన్, ఎనోక్ రెండు కంపెనీల సంబంధిత మొబైల్ అప్లికేషన్లు, డిజిటల్ వాలెట్లను కూడా అనుసంధానం కానున్నాయి. వినియోగదారులు రెండు ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఆటోమోటివ్ సేవలను బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.ఇతర ఎమిరేట్స్ లకు తమ సేవలను విస్తరించనున్నట్లు పార్కిన్ సీఈఓ ఇంజనీర్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ అలీ తెలిపారు.
పార్కిన్ మార్చి 2025 నుండి దుబాయ్ అంతటా ప్రీమియం పార్కింగ్ ఛార్జీలను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రీమియం పార్కింగ్ స్థలాలకు రుసుము ఉదయం 8 నుండి ఉదయం 10 గంటల వరకు గంటకు ..సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు Dh6 వసూలు చేయనున్నారు. ఇతర అన్ని ఇతర పబ్లిక్ పెయిడ్ పార్కింగ్ స్థలాలకు గంటకు Dh4 గా ఉంటుంది. గంటకు Dh6 పార్కింగ్ ఫీజు మెట్రో స్టేషన్ నుండి 500 మీటర్ల లోపల ఉన్న ప్రాంతాలలో.. రద్దీ సమయాల్లో అధిక పార్కింగ్ ఉన్న ప్రాంతాలలో..అలాగే మార్కెట్లు, వాణిజ్య కేంద్రాలలో అమలు చేయనున్నారు.
తాజా వార్తలు
- భారత్–షార్జా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు డ్రైవర్లకు కీలక సూచనలు..!!
- సౌదీ ప్రజలకు భారత కాన్సుల్ జనరల్ శుభాకాంక్షలు..!!
- బంధువుల మధ్య వివాహాలతో జన్యు వ్యాధుల ముప్పు.. డాక్టర్ల హెచ్చరికలు..!!
- ఓపెన్ ప్రిజన్స్ ప్రోగ్రామ్.. ఖైదీల కళల్లో శాంతి సందేశాలు..!!
- యూఎన్ఓలో ఖతార్ అమిర్ ప్రసంగానికి దౌత్యవేత్తల ప్రశంసలు..!!
- ముత్రా కేబుల్ కార్ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష..!!
- ఇంట్లోకి చొరబడి కాల్పులు, 11 మంది మృతి
- ఆసియా-పసిఫిక్‌లో ఏరో ఇంజిన్ సేవల విస్తరణకు జీఎంఆర్ ఏరో టెక్నిక్–స్టాండర్డ్ ఏరో భాగస్వామ్యం
- యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన







