మరో ఘనత సాధించిన ఇస్రో..ఇస్రో స్పేస్ డాకింగ్ సక్సెస్
- January 16, 2025
న్యూఢిల్లీ: గత కొన్నేళ్లుగా అంతరిక్షంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ఇస్రో.. సంచలన విజయాలతో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా 2025 ఏడాదిలో తొలి విజయాన్ని అందుకుంది. గతేడాది చివర్లో నింగిలోకి పంపించిన స్పెడెక్స్ ప్రయోగానికి సంబంధించి డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ స్పేస్ డాకింగ్ ప్రక్రియ సక్సెస్ అయినట్లు స్వయంగా ఇస్రో.. ట్విటర్‌లో వెల్లడించింది. ఇక అంతరిక్షంలో శాటిలైట్లను అనుసంధానం చేయడం చాలా క్లిష్టమైన పని కాగా.. ఇప్పటివరకు ప్రపంచంలో మూడు దేశాలు మాత్రమే.. ఈ ఘనతను సాధించాయి. తాజాగా ఇస్రో చేపట్టిన స్పేస్ డాకింగ్ పూర్తి కావడంతో ఇప్పుడు ఆ జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది.
ఇది ఒక చరిత్రాత్మక క్షణం అని ఇస్రో పేర్కొంది. 15 మీటర్ల నుంచి 3 మీటర్ల హోల్డ్ పాయింట్ వరకు ఈ డాకింగ్ పూర్తి అయినట్లు ప్రకటించింది. అత్యంత ఖచ్చితత్వంతో డాకింగ్ ప్రక్రియను ప్రారంభించగా.. అది విజయవంతంగా అనుసంధానం అయిందని పేర్కొంది. ఈ స్పేస్ డాకింగ్ ప్రక్రియ విజయవంతం కావడంతో.. ప్రపంచంలోనే ఇలాంటి స్పేస్ డాకింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరించినట్లు ఇస్రో వెల్లడించింది. భారత్ కంటే ముందు చైనా, రష్యా, అమెరికా దేశాలు స్పేస్ డాకింగ్‌లో విజయవంతం అయ్యాయి. ఈ సందర్భంగా ఈ ప్రక్రియలో పాల్గొన్న ఇస్రో టీమ్‌కు, దేశానికి ఇస్రో శుభాకాంక్షలు తెలిపింది.
ఇటీవల గత డిసెంబర్ 30వ తేదీన తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సీ60(పీఎస్ఎల్వీ-సీ60) వాహకనౌకలో రెండు శాటిలైట్లను ఇస్రో శాస్త్రవేత్తలు నింగిలోకి పంపించారు. SDX01 (ఛేజర్), SDX02 (టార్గెట్) అనే రెండు ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపించగా.. అక్కడే వాటిని అనుసంధానం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఆ రెండు ఉపగ్రహాలను తాజాగా విజయవంతంగా అనుసంధానం చేసినట్లు ఇస్రో తెలిపింది. ఈ మేరకు స్పేడెక్స్ డాకింగ్ ప్రక్రియ విజయవతంగా పూర్తయినట్లు ఇస్రో వెల్లడించింది.
SpaDeX Docking Update:
— ISRO (@isro) January 16, 2025
🌟Docking Success
Spacecraft docking successfully completed! A historic moment.
Let’s walk through the SpaDeX docking process:
Manoeuvre from 15m to 3m hold point completed. Docking initiated with precision, leading to successful spacecraft capture.…
పీఎస్‌ఎల్‌వీ సీ-60 నింగిలోకి దూసుకెళ్లిన 15.09 నిమిషాలకు స్పేడెక్స్-1బి.. 15.12 నిమిషాలకు స్పేడెక్స్-1ఎ రాకెట్ నుంచి విడిపోయాయి. ఆ తర్వాత వాటిని డాకింగ్ కోసం ఇస్రో శాస్త్రవేత్తలు 3 సార్లు ప్రయత్నించారు. అయితే వివిధ కారణాల వల్ల ఈ డాకింగ్ ప్రక్రియ వాయిదా పడుతూ రాగా.. తాజాగా సక్సెస్ అయింది. ఈ క్రమంలోనే ఆ రెండు శాటిలైట్ల మధ్య దూరాన్ని 15 మీటర్ల నుంచి 3 మీటర్లకు తీసుకువచ్చినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక ఈ స్పేస్ డాకింగ్ ప్రక్రియ విజయవంతం కావడంతో ఇస్రో తదుపరి కీలక ప్రాజెక్టులైన భారతీయ అంతరిక్ష కేంద్రం, చంద్రయాన్ 4 ప్రయోగాలకు ఇది తోడ్పాటును అందించనుంది.
తాజా వార్తలు
- IRGC-అనుబంధ నెట్వర్క్ బస్ట్.. 41 మంది అరెస్ట్..!!
- కువైట్ లో 90 నిమిషాల ముందే చెక్-ఇన్ కౌంటర్లు మూసివేత..!!
- యూఏఈలో ఫ్యూయల్, సాలిక్ , పార్కింగ్ లో మార్పులతో అదనపు భారం..!!
- ఒమన్‌లోకి అక్రమంగా ప్రవేశించిన 22 మంది అరెస్టు..!!
- ఖతార్‌లో అమల్లోకి వచ్చిన ఔట్ సైడ్ సమ్మర్ వర్కింగ్ అవర్స్..!!
- ప్రాంతీయ భద్రతపై క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ అధ్యక్షుడు చర్చలు..!!
- IPL 2026: వరుసగా 2వసారి ఐపీఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు..
- ఎడిసన్‌లో 'NATS'-సాయి దత్త పీఠం ఉచిత వైద్య శిబిరం ప్రవాసుల నుండి విశేష స్పందన
- ఏపీకి దక్కిన అరుదైన గౌరవం
- ఆంధ్ర భవన్లో ఘనంగా నిర్వహించిన ఆత్మ గౌరవ దివస్–2026









